Suspense on Inter results: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం.. విద్యార్థుల్లో అసహనం కలిగిస్తోంది. కరోనా తీవ్రత కారణంగా గతేడాది పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశారు. పరిస్థితులు కొంత కుదుట పడటంతో... రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించారు. గత నెల 3న ఈ పరీక్షలు ముగిశాయి.
సాధారణంగా నెల రోజుల్లోపే ఫలితాలను వెల్లడించే ఇంటర్ బోర్డు.. మొదటి సంవత్సరం ఫలితాలను ఇప్పటి వరకూ వెల్లడించలేదు. మరోవైపు రేపో, మాపో ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయంటూ కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్.. మరోవైపు ఇంటర్ బోర్డు స్పష్టతనివ్వక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. జాప్యానికి కారణం.. ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: TS icet seat allotment 2021: ఐసెట్ సీట్ల కేటాయింపు పూర్తి.. ఇంకా ఎన్ని మిగిలాయంటే?