ETV Bharat / state

తెలంగాణ సోనాతో.. మధుమేహం నియంత్రణ - సోనా మసూరి బియ్యం వార్తలు

బాస్మతి, సోనా మసూరి, బ్రౌన్‌ బియ్యం, తృణధాన్యాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యం రుచి, ఆరోగ్యకరం అనే విషయం చాలామందికి తెలియదు. ఈ అన్నం తిన్నాక రక్తంలో గ్లూకోజ్‌ శాతం అంతకుముందు ఉన్నదానికన్నా 10 శాతం వరకూ తగ్గిందని పలువురు వినియోగదారులు చెప్పారు. టైప్‌-2 రకం మధుమేహాన్ని నియంత్రించడానికి ఈ బియ్యం ఉపయోగపడుతున్నాయని వెల్లడైంది.

surveys-says-telangana-sona-rice-will-help-in-reducing-blood-glucose
మధుమేహం నియంత్రణకు దోహదం చేసే తెలంగాణ సోనా
author img

By

Published : Dec 23, 2020, 7:05 AM IST

తెలంగాణ సోనా సన్న బియ్యం ఆరోగ్యం.. రుచికరం.. అనే నినాదంతో విరివిగా మార్కెటింగ్‌ చేయాలని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ), ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించాయి. ‘తెలంగాణ సోనా బియ్యం మార్కెటింగ్‌ వ్యూహం’ పేరుతో ఈ రెండు సంస్థలు కలిసి నిర్వహించిన సర్వే నివేదికను మంగళవారం ప్రభుత్వానికి అందజేశాయి. కిరాణా దుకాణం యజమాని ఏ రకం బియ్యం మంచివని చెబితే వాటినే 36 శాతం మంది వినియోగదారులు కొంటున్నారని.. దుకాణాల యజమానులకు తెలంగాణ సోనాపై అవగాహన కల్పించి, ప్రోత్సాహకాలు, కమీషన్లు ఇచ్చి ఎక్కువ అమ్మేలా చూడాలని నివేదికలో సూచించారు.

56% మంది తెలియదన్నారు

తెలంగాణ సోనా బియ్యం వినియోగం రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందని, దీనిపై రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో 340 మందిని ప్రశ్నించి సర్వే చేసినట్లు ఈ సంస్థలు తెలిపాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 56 శాతం మంది తమకు తెలంగాణ సోనా రకం గురించి తెలియదన్నారని వెల్లడించాయి.

సాగు ఖర్చూ తక్కువే

* ఈ రకం వరి విత్తనం సాగుతో ఏటా ప్రతి లక్ష ఎకరాలకు సగటున 20 నుంచి 40 లక్షల క్యూబిక్‌ అడుగుల నీటి వినియోగం తగ్గుతుంది. రసాయన పురుగుమందుల వాడకం తగ్గడం వల్ల ఎకరాకు రూ.2 వేల వరకూ ఆదా అవుతుంది.
* వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ తెలంగాణ సోనా రకం సాగుచేయవచ్చు. ఇతర రకాలకన్నా 30 రోజులు తక్కువ పంట కాలం వల్ల రైతులకు ఉపయోగకరం. గత వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో ఈ రకం వరిని 10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

జీవనశైలి వ్యాధులకు పరిష్కారంగా..

‘‘బియ్యంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం, గ్లైసిమిక్స్‌ సూచిక అధికంగా ఉండడంతో జీవన శైలి వ్యాధులకు బియ్యం అన్నం కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ‘తెలంగాణ సోనా’(ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) వంగడాన్ని విడుదల చేసింది. ఇతర సాధారణ రకాల బియ్యంలో గ్లైసిమిక్స్‌ సూచిక (ఇది ఎక్కువ ఉంటే మధుమేహానికి దారితీస్తుందని అంచనా) 56.5% వరకూ ఉంటుండగా.. తెలంగాణ సోనాలో ఇది 51.5% మాత్రమే. ఇంకా పోషక విలువలు, విటమిన్‌ బీ3, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ప్రతి వంద గ్రాముల తెలంగాణ సోనా బియ్యంలో 3 గ్రాముల పీచు(ఫైబర్‌), 8 గ్రాముల పోషకాలు, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఈ బియ్యం మంచి నాణ్యత, మంచి వాసన కలిగి ఉంటాయి’’ అని నివేదికలో పేర్కొన్నారు.

దేశంలో బియ్యం ముఖచిత్రం...

* దేశంలో అధిక శాతం ప్రజల్లో రోజుకోసారైనా వరి అన్నం తినే అలవాటు ఉంది. కొందరు మధ్యాహ్నం సమయంలో వరిఅన్నం, రాత్రిపూట గోధుమ రొట్టెలు తింటున్నారు. ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో కొంత తృణధాన్యాలనూ తింటున్నారు. మార్కెట్‌లో వాటి అమ్మకాల వాటా 10 శాతమే.
* దేశంలో 2019లో 10.20 కోట్ల టన్నుల బియ్యాన్ని వినియోగించారు.
* తలసరి జాతీయ బియ్యం వినియోగం 72 కిలోలు.
* జాతీయ మార్కెట్‌లో బాస్మతి బియ్యం వాటా 16%, బాస్మతియేతర రకాలు 81%, ఇతర ప్రైవేటు రకాల బియ్యం వాటా 3% ఉంది.
* బిజినెస్‌ మానిటర్‌ ఇంటర్నేషనల్‌(బీఎంఐ) పరిశోధన ప్రకారం దేశంలో ప్రజల వ్యయంలో ఆహారోత్పత్తులకు 32.60% సొమ్మును వెచ్చిస్తున్నారు. ఇది రూ.3.90 లక్షల కోట్లకు సమానం. బియ్యం, బ్రెడ్‌, తృణధాన్యాల కొనుగోలుకు ఈ సొమ్మును ఖర్చు పెడుతున్నారు.
* గత మూడేళ్ల(2016-19)లో దేశంలో సగటున ఏటా 4.38 లక్షల హెక్టార్లలో వరి పంటను పండించారు. ఏటా సగటున 11.30 కోట్ల టన్నుల బియ్యం దిగుబడి వచ్చింది. సగటున హెక్టారుకు 2,600 కిలోల పంట పండింది.
* మన దేశంలో పండుతున్న బియ్యంలో 87%.. సాధారణ కిరాణా దుకాణాల ద్వారానే ప్రజలకు విక్రయిస్తున్నారు. హైపర్‌ మార్కెట్లలో 8, సూపర్‌ మార్కెట్లలో 4, ఇతర స్టోర్లలో 1% అమ్ముతున్నారు.
* గతేడాది ప్యాక్‌ చేసిన బియ్యం అమ్మకాలు 38 లక్షల టన్నులుంది. దీని వ్యాపార విలువ రూ.47 వేల కోట్లు. గత ఐదేళ్లలో ప్యాక్‌ చేసిన బియ్యం అమ్మకాల వృద్ధిరేటు 18% ఉండగా వచ్చే ఐదేళ్ల(2019-24)లో 12% ఉండవచ్చని అంచనా.

ఇదీ చూడండి: తెలంగాణ సోనామసూరికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.