ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు గంజాల స్వాములు.. తన మామిడితోటలో అంతర్ పంటగా చిలకడదుంపను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయం కావటంతో దుంపలను తవ్వించగా.. ఒక చిలకడదుంప భారీ సైజులో బయటపడింది.
దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దుంపను తూకం వేయగా.. ఆరు కేజీలు ఉన్నట్లు తేలింది. భారీ సైజులో చిలకడదుంప పండటంతో రైతు స్వాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి: ప్రతిధ్వని: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరాలు