తానేప్పుడూ నామినేటెడ్ పోస్టులు కోరుకోలేదని సురభి వాణీదేవి పేర్కొన్నారు. ప్రజల మద్దతుతోనే చట్టసభలకు వెళ్తానని స్పష్టం చేశారు. గెలుపు, ఓటములపై విపక్షాలు వంకరగా మాట్లాడవద్దని కోరారు. తన గెలుపును పట్టభద్రులైన ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు.
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అవగాహన ఉందని చెప్పారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వెల్లడించారు. కేసీఆర్ తనపై నమ్మకం ఉంచే అభ్యర్థిగా ఎంపికచేశారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ప్రాంతీయ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం