ETV Bharat / state

నేటి నుంచి ఆన్​లైన్ వేదికగా సురభి నాటకాలు - surabhi dramas are playing through online

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. సురభి నాటకాలను ప్రేక్షకులు ఆన్​లైన్ వేదికగా వీక్షించేందుకు నిర్ణయించింది. ఈ రోజు నుంచి ఏప్రిల్​ 27 వరకు ఈ నాటకాలను ప్రదర్శించనున్నారు.

surabhi dramas
సురభి నాటకాలు
author img

By

Published : Mar 27, 2021, 3:35 PM IST

నాటక రంగంలో 135 ఏళ్ల చరిత్ర కలిగిన సురభి కళాకారులను ఆదుకునేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారిగా ఆన్​లైన్ వేదికగా ప్రేక్షకులు సురభి నాటకాలను వీక్షించేలా ఏర్పాట్లు చేసింది. శ్రీవెంకటేశ్వర సురభి థియేటర్ జయచంద్రవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

పురాణ ఇతిహాస నాటకాలు

మార్చి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆన్​లైన్ స్ట్రీమింగ్​లో సురభి నాటకాలను ప్రదర్శించనున్నారు. సురభి నాటకాల్లో ప్రఖ్యాతి గాంచిన మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం లాంటి 9 నాటకాలను ఆన్​లైన్​లో ప్రదర్శించనున్నారు. బుక్ మై షో ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ఈ నాటకాలను వీక్షించవచ్చు. తద్వారా సమకూరే మొత్తాన్ని సురభి కళాకారుల కుటుంబాలకు అందజేయనున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు కరోనా అడ్డుగోడగా మారకూడదనే ఉద్దేశంతో సినిమా, నాటకం, సాహిత్య కార్యక్రమాలను విరివిగా ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నామని హరికృష్ణ వివరించారు. సురభి నాటకాలను ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరువ చేసేందుకు ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: వంటకాలే ఆ వనితల ఉపాధి... విదేశాలకు వారి అభి'రుచి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.