ETV Bharat / state

ఏపీ హైకోర్టు ఆదేశాలపై... సుప్రీం కోర్టు స్టే

మిషన్​ బిల్డ్ ఏపీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై... సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.

mission build ap, supreme court
మిషన్​ బిల్డ్​ ఏపీ, సుప్రీం కోర్టు
author img

By

Published : Feb 10, 2021, 1:41 PM IST

మిషన్ బిల్డ్ ఏపీ అంశంపై సుప్రీం కోర్టులో.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. మిషన్ బిల్డ్ ఏపీ అంశంలో రిక్యుజల్ పిటిషన్​పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్​పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేయటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాలు చేస్తూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరింది.

విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి: బల్దియా పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.