Supreme Court lawyers on TS Elections : తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్కు.. సుప్రీంకోర్టు న్యాయవాదులు పలు విజ్ఞాపనలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గత అఫిడవిట్, ఇప్పుడు సమర్పించే అఫిడవిట్లు పోల్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. 2018 నాటి నుంచి నేటికి.. అభ్యర్థుల ఆస్తులు ఐదేళ్లలో భారీగా పెరిగాయని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో అభ్యర్థుల ఆదాయం ఎలా పెరిగిందో పరిశీలించాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థి ఆదాయ ధృవీకరణపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని వారు కేంద్ర ఎన్నికల అధికారులను కోరారు. ఆదాయం ఎలా పెరిగిందో ఎన్నికలకు ముందే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించటం లేదని ఫిర్యాదు చేశారు. కేసుల గురించి కూడా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని కోరారు.
Justice NV Ramana: 'పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు'
Same Sex Marriage Supreme Court Verdict : స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నిరాకరణ