ETV Bharat / state

Supreme Court on MLC Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్​పై నవంబర్‌ 20న సుప్రీం విచారణ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court on MLC Kavitha Petition
Supreme Court
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 1:26 PM IST

Updated : Sep 26, 2023, 3:28 PM IST

13:23 September 26

మద్యం కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ వాయిదా

Supreme Court on MLC Kavitha Petition in Deli Liquor Policy : సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు ఊరట లభించింది. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు(Delhi liquor Scam)లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. నవంబరు 20వ తేదీన విచారణ చేపడతామని తెలిపింది. అక్టోబరు 18న మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కు సంబంధించిన కేసుల ప్రత్యేక విచారణ జరగనున్న నేపథ్యంలో.. వాటి విచారణ పూర్తైన తర్వాతే దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

SC Postpones Kavitha Petition in Delhi Liquor Scam : అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనం తెలిపింది. ఈ నెల 15వ తేదీ ఈడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 20వ తేదీ వరకు ఆ ఉత్తర్వులే కొనసాగుతాయని తాజాగా స్పష్టం చేసింది. మరోవైపు నవంబర్ 20వ తేదీ వరకు కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది ఎఎస్‌జీ రాజు ధర్మాసనానికి వివరించారు.

సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ఈనెల 15న మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. అప్పటివరకు అవే ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌తో కూడిన ధర్మాసనం వివరించింది.

Delhi Excise Case :​ సిసోదియాకు ఈడీ షాక్​.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్​!

Deli Liquor Scam Case : కేసు విచారణ జరుగుతోంది దిల్లీలోనే.. కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు.. వివరాలు గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులన్నీ ఇక్కడే ఉన్నట్లు ఈడీ తరఫున సీనియర్‌ న్యాయవాది తెలిపారు. ఈ కేసు పీఎంఎల్‌ఏ, ఈడీకి ముడిపడి ఉన్నందున అక్టోబరు 18 తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

సెప్టెంబరు 15న ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సెప్టెంబరు 4వ తేదీన ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారు. అందుకు ఆమె నేరుగా మహిళను ఎలా విచారణకు పిలిపిస్తారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు సుప్రీంకోర్టు నవంబరు 20వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. అప్పటివరకు ఎమ్మెల్సీ కవితను ఎటువంటి విచారణకు పిలవకూడదని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదు: ఎమ్మెల్సీ కవిత

ఇంటికి వచ్చి విచారించండి.. ఆడియో, వీడియో ద్వారా అయినా ఓకే : ఎమ్మెల్సీ కవిత

Last Updated : Sep 26, 2023, 3:28 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.