తెలంగాణలో రేషన్‌కార్డుల పునరుద్ధరణ ఆదేశాలపై తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. రేషన్ కార్డుల తొలగింపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం వివరించింది. సర్కారు తరపున అదనపు సొలిసిటరీ జనరల్ అమన్ లేఖి, న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత మూడేళ్లలో అనర్హులను గుర్తించి రేషన్ కార్డులను తొలగించామని ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అనర్హులకు తిరిగి పునరుద్ధరించడం వీలు కాదని.. రాష్ట్రంలో కరోనా సంక్షోభ సమయంలో నిత్యావసరాల కావాల్సిన అందరికీ రూ.1,500 నగదుతో పాటు రేషన్ అందించామని వాదించారు. హైకోర్టులో ఇంకా విచారణ ఉన్నందున ఆదేశాలను సవరించాలని అక్కడే దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది. ప్రభుత్వం దాఖలు చేసే సవరణ దరఖాస్తులోని వాస్తవాలను పరిశీలించి హైకోర్టులో నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!