SC Hearing On Amaravati Petitions: ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర విభజన, రాజధాని అమరావతి కేసుల విచారణను విడివిడిగానే చేపడతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. రెండు కేసులను వేటికవే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టులో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారని కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ దశలో జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ రుషికేశ్ రాయ్‌ల ధర్మాసనం జోక్యం చేసుకుంది. సుప్రీం కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లపై రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రభుత్వం తరఫు న్యాయవాది వైద్యనాదన్ ధర్మాసనానికి వివరించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆయన కోరగా.. ఈ నెల 28నే అన్ని అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం ప్రకటించింది.
ఇవీ చదవండి: బుక్ చేసిన క్యాబ్ ఎంతకీ పికప్ లోకేషన్‌కు రావట్లేదా.. ఇక ఆ సమస్య తీరినట్లే..
మత మార్పిళ్లపై సుప్రీం హెచ్చరిక.. రంగంలోకి దిగాలని కేంద్రానికి ఆదేశం