ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారించిన హైకోర్టు... రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్ 1న ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ సర్కార్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ వినతికి ధర్మాసనం సమ్మతించింది. శీతాకాల సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'దర్యాప్తు పూర్తి కాకుండా.. ఎలా జోక్యం చేసుకోవాలి'