ETV Bharat / state

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ విచారణ జనవరి 14కు వాయిదా

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్​లో అవకతవకలు జరిగాయని సుప్రీంలో దాఖలైన పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం జనవరి 14వ తేదీకి వాయిదా వేసింది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ విచారణ జనవరి 14కు వాయిదా
author img

By

Published : Nov 25, 2019, 10:53 PM IST

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్​లో అవతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్​పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్ట్​ వ్యయం అక్రమంగా పెంచారంటూ నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

నాగం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్... ఇటీవల ప్రాజెక్ట్​ కాంట్రాక్టు సంస్థపై ఐటీ దాడులు జరిగాయని.. ఆదాయపన్ను శాఖను కూడా పిటిషన్​లో పార్టీగా చేరిస్తే మరింత సమాచారం వస్తుందని కోర్టుకు తెలిపారు. ఐటీని పార్టీగా చేయని పక్షంలో సీబీఐ సమాచారం తీసుకుని కోర్టుకు తెలియజేసేలా చూడాలని ప్రశాంత్ భూషన్ కోరారు.

ఆదాయపన్ను శాఖ సోదాలకు సంబంధించి ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా తమ సంస్థ పేర్లు లేవని.. ఆ విభాగాన్ని పార్టీగా చేయాల్సిన అవసరం లేదని మెఘా ప్రాజెక్ట్​ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పరిశీలించిన ధర్మాసనం... అవసరమనుకుంటే కేసు విచారణలో సీబీఐ సాయం అందించవచ్చని సూచించింది. దీనిపై సమగ్రంగా వచ్చే ఏడాది జనవరి 14న వాదనలు వింటామంటూ విచారణ వాయిదా వేసింది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ విచారణ జనవరి 14కు వాయిదా

ఇదీ చూడండి: అందుబాటులోకి రానున్న హైటెక్​ సిటీ- రాయదుర్గం మెట్రో

File Name: TG_HYD_Del_01_25_PALAMURU_SUPREME_DRY_AV_3181995 Slug: Reporter: విద్యా సాగర్ Cam: ( ) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో అవతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్టు వ్యయం అక్రమంగా పెంచారంటూ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. నాగం తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్... ఇటీవల ప్రాజెక్టు కాంట్రాక్ట సంస్థపై ఐటీ దాడులు జరిగాయని.. ఐటీని కూడా పిటిషన్ లో పార్టీగా చేరిస్తే మరించ సమాచారం వస్తుందని కోర్టుకు తెలిపారు. ఐటీని పార్టీగా చేయని పక్షంలో సీబీఐ సమాచారం తీసుకోని కోర్టు తెలిజేసేలా చూడాలని ప్రశాంత్ భూషన్ కోరారు. ఐటీ సోదాలకు సంబంధించిన ఆ శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా తమ సంస్థ పేర్లు లేవని.. ఐటీని పార్టీగా చేయాల్సిన అవసరం లేదని మెఘా ప్రాజెక్టు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవసరం అనుకుంటే సీబీఐ కేసు విచారణలో సహాయం అందించవచ్చని అభిప్రాయడ్డ ధర్మాసనం.. సమగ్రంగా వచ్చే ఏడాది జనవరి 14న వాదనలు వింటామని వాయిదా వేసింది. vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.