ఆర్టికల్ 32 ప్రకారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాడాన్ని సీజేఐ బోబ్డే తప్పుబట్టారు. ఆర్టికల్ 32 పరిధిని తగ్గించాలనుకుంటున్నట్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెవేళ్ల లోక్‌సభ 2019 ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేసినా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు విచారణను త్వరగా ముగించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అభ్యర్థించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మీనాక్షి అరోరాకు సీజేఐ సూచించారు. హైకోర్టు సీజేకి దరఖాస్తు చేసుకునేందుకు పిటిషనర్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచన మేరకు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఇదీ చదవండి: ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ