Support From Ex MLAs in Telangana Elections 2023 : రసవత్తరంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections) ప్రతీ ఓటు కీలకమే. పార్టీ చరీష్మాకున్న ఓటుబ్యాంకుతో పాటు.. అదనంగా ఓట్లుపడే అవకాశం రావడం అదృష్టమే. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకుని విజయం సాధించాలని ప్రస్తుత అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : అయితే వీరి గెలుపునకు టికెట్ రాని అసంతృప్తుల నుంచి కాస్త ముప్పు ఎదురవుతోంది. ఇది గమనించిన అభ్యర్థులు చాకచక్యంగా వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎలాగో చివరకు రాజీకి వచ్చిన మాజీ నేతలు తాజా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు ఓట్లు వేసిన వారంతా ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి నిలుచుకున్న అభ్యర్థులకు ఓటు వేయాలని వారి గెలుపు కోసం వీరు తాపత్రయపడుతున్నారు. ఇలా మాజీ నేతల ఓట్లలో సగం ఓట్లు తమకు వచ్చినా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు.
ఇదీ తెలంగాణలో తాజా - మాజీల 'రాజీ'కీయం.....
నర్సాపూర్ నియోజకవర్గంలో 2018లో జరిగిన ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి(కాంగ్రెస్)ని బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి ఓడించారు. కొంతకాలానికి ఆమె బీఆర్ఎస్లో చేరి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అయ్యారు. తాజాగా పార్టీ ఆమెను అభ్యర్థిగా ఎంపికచేసి, టికెట్ కేటాయించింది. ఇప్పుడు సునీతకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మద్దతు పలికారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి టికెట్ రాలేదు. తమ పార్టీ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డి(BRS)... నాగం జనార్దన్‌రెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. ప్రస్తుతం నాగం బీఆర్ఎస్లో చేరి మర్రి విజయానికి పాటుపడుతున్నారు. ఆర్మూర్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పి.వినయ్‌కుమార్‌రెడ్డి.. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫారం సాధించారు. ఇప్పుడు వినయ్‌తో.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత కలిసి పనిచేస్తున్నారు.
EX MLAs Support To Present Candidates in Telangana : మహేశ్వరంలో సబితారెడ్డి(కాంగ్రెస్)...అప్పుటి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలిచారు. అనంతరం సబితా బీఆర్ఎస్ చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు కృష్ణారెడ్డి మద్దతిస్తున్నారు. తాండూరు స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరారు. మళ్లీ ఇప్పుడు ఆయనకే టికెట్ ఇచ్చింది. నాటి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పుడు రోహిత్‌కు మద్ధతిస్తున్నారు.
ఎన్నికల సిత్రం - మొన్నటి వరకు స్నేహితులు - కుర్చీ కొట్లాటలో ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులు
సొంత పార్టీలోనూ మార్పులు.. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకూ పార్టీ టికెట్ లభించలేదు. దాంతో ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఈ ఇద్దరూ జనగామలో పల్లా విజయానికి మద్దతిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య స్థానంలో బీఆర్ఎస్ అధిష్ఠానం కడియంకి టికెట్ ఇచ్చింది. 2018 ఎన్నికల్లో పోటీచేసిన రాజయ్యకు మద్దతుగా శ్రీహరి నిలవగా.. ఈసారి ఎన్నికల్లో శ్రీహరి తరఫున రాజయ్య ప్రచారం చేయాలని అధిష్ఠానం సూచించింది.
వరంగల్ తూర్పు స్థానం నుంచి వద్దిరాజు రవిచంద్ర(కాంగ్రెస్)పై.. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ గెలిచారు. కొంతకాలానికి రవిచంద్ర బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు నరేందర్ గెలుపుకు మద్దతిస్తున్నాడు. భూపాలపల్లి నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి(కాంగ్రెస్).. బీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కింది. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారిని.. గండ్ర విజయానికి పనిచేయాలని అధిష్ఠానం ఒప్పించింది.
చిన్న పార్టీలు, స్వతంత్రులకు రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తుల కేటాయింపు - బీఆర్ఎస్ నేతల్లో గుబులు
వైరా నుంచి 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్.. బీఆర్ఎస్లో చేరారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌కే మళ్లీ టికెట్ ఇచ్చింది. రాములు నాయక్ భవిష్యత్‌కు అధిష్ఠానం భరోసా ఇవ్వడంతో ఆయన మదన్‌లాల్ గెలుపుకు కృషి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి, రెండోస్థానంలో నిలిచిన విష్ణువర్ధన్‌రెడ్డి.. ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి టికెట్ దక్కింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఇప్పుడు కసిరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి 2018 ఎన్నికల్లో రామ్మోహన్‌గౌడ్(బీఆర్ఎస్)పై సుధీర్‌రెడ్డి(కాంగ్రెస్) గెలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరిన సుధీర్‌రెడ్డి ఇప్పుడు పార్టీ అభ్యర్థి అయ్యారు. కేవలం 1,939 ఓట్ల తేడాతో ఓడిన రామ్మోహన్‌గౌడ్ ప్రస్తుతం సుధీర్‌రెడ్డి గెలుపుకు కృషి చేస్తున్నారు.