ETV Bharat / state

చూస్తే పిజ్జా ప్యాక్‌.. విప్పితే మెథకొలైన్

హైదరాబాద్​లో భారీ మాదకద్రవ్యాల రాకెట్‌ గుట్టురట్టయింది. బర్గర్‌, శాండ్‌విచ్‌ రూపాల్లో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నారు. కొరియర్‌ పార్శిళ్లలో ఆస్ట్రేలియాకు తరలించే యత్నం చేశారు. కొరియర్ సంస్థ ఇచ్చిన సమాచారంతో బయటపడింది.

pizza
చూస్తే పిజ్జా ప్యాక్‌.. విప్పితే మెథకొలైన్
author img

By

Published : Jan 25, 2021, 8:51 AM IST

హైదరాబాద్‌ నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) దర్యాప్తులో భారీ మాదకద్రవ్యాల రాకెట్‌ గుట్టురట్టయింది. హైదరాబాద్‌లోని ఓ కొరియర్‌ సర్వీస్‌లో లభించిన సమాచారం ఆధారంగా 75 రోజులపాటు కూపీ లాగడంతో ఎట్టకేలకు చెన్నైలో మాదకద్రవ్యాల స్థావరం జాడ తెలిసింది. చెన్నై నుంచి మాదకద్రవ్యాల్ని పంపిస్తే దర్యాప్తు సంస్థలకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో ఆ ముఠా పన్నిన పన్నాగం.. కొరియర్‌ సంస్థ ఇచ్చిన సమాచారంతో బెడిసికొట్టింది.

హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని ప్రముఖ కొరియర్‌ సంస్థ నిర్వాహకులకు ఓ పార్శిల్‌పై అనుమానం వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకులు గత నవంబరు 7న ఎన్‌సీబీ అధికారులకు సమాచారం అందించారు. పిజ్జా, బర్గర్‌, శాండ్‌విచ్‌లతో కూడిన పార్శిళ్లను స్కానింగ్‌ చేయడంతో మాదకద్రవ్యాల జాడలు కనిపించాయన్నది ఆ సమాచారం సారాంశం. అప్రమత్తమైన హైదరాబాద్‌ ఎన్‌సీబీ అధికారులు వాటిని తెరిచి చూడటంతో అనుమానాలు నిజమయ్యాయి. పిజ్జా, బర్గర్‌, శాండ్‌విచ్‌ ప్యాక్‌ల లోపల మాదకద్రవ్యాల్ని అమర్చిన ముఠా.. పైనా, కింద తెలివిగా కవర్లను చుట్టి ఉంచినట్లు గుర్తించారు. కొరియర్‌ సంస్థలోని ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల ద్వారా స్కానింగ్‌ చేయడంతో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న అక్రమ మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడింది. కొరియర్‌ నిర్వాహకులు అదే సమాచారాన్ని ఎన్‌సీబీ అధికారులకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా పార్శిళ్లను విప్పి చూసిన అధికారులు వాటిలో ఉన్న 4.35 కిలోల మెథకొలైన్‌ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్శిళ్లను ఆస్ట్రేలియా పంపేందుకు సిద్ధం చేసినట్లు ఎగుమతి చిరునామా ఆధారంగా గుర్తించారు.

చెన్నై నుంచి విశాఖపట్నం మీదుగా..

ఆ సమయంలో మాదకద్రవ్యాలు లభ్యమైనా నిందితులు మాత్రం ఎన్‌సీబీకి చిక్కలేదు. కారణం ఆ కొరియర్‌ విశాఖపట్నం నుంచి బుక్‌ చేయడమే. ఆ వివరాల ఆధారంగా ఎన్‌సీబీ అధికారులు అక్కడి కొరియర్‌ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా.. అక్కడ చెన్నై మూలాలు లభించాయి. తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన ముఠా సభ్యులు ఈ పన్నాగానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా చెన్నై ఎన్‌సీబీకి సమాచారం అందించి ఆపరేషన్‌ కొనసాగించారు. సుదీర్ఘ గాలింపు తర్వాత చెంగల్పట్టు జిల్లాలోని మారయిమలైనగర్‌లో మాదకద్రవ్యాలు తయారుచేసిన ముఠా స్థావరాన్ని కనుగొన్నారు. రెండు రోజుల క్రితం స్థావరంపై దాడి చేయడంతో మరో 45 కిలోల ఎపిడ్రిన్‌ దొరికింది. ఆ స్థావరంలో ముఠా సభ్యులు ఖాజా మీరాన్‌, మైదిన్‌ చిక్కారు. వీరిద్దరూ మాదకద్రవ్యాల్ని పిజ్జా, బర్గర్‌, శాండ్‌విచ్‌ మేకర్లలో అమర్చే పనిలో మాత్రమే పాలుపంచుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. వీరిద్దరే విశాఖపట్నానికి వచ్చి పార్శిళ్లను ఆస్ట్రేలియాకు పంపేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ఎన్‌సీబీ అధికారులు మాదకద్రవ్యాలను తయారుచేసిన సూత్రధారులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.