రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన 28 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ఏప్రిల్ నెలలోనే వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
సంస్థలో మిగిలిన 16,840 మంది డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు వేస్తున్నామని సునీల్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని సునీల్ శర్మ వివరించారు.
ఇదీ చూడండి: Asaduddin: మరోసారి లాక్డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్