రాష్ట్రంలో మూసి ఉన్న చక్కెర పరిశ్రమలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు అసెంబ్లీని ముట్టుడించేందుకు ప్రయత్నించారు. జనగామ, నిజామాబాద్‌కు చెందిన పలువురు రైతులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. నాంపల్లికి చేరుకున్న రైతులు అక్కడి నుంచి అసెంబ్లీ సమీపాన ఉన్న గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎతున నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపుకు చొచ్చుకెళ్లారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చక్కెర రైతులను అడ్డుకున్నారు. చక్కెర పరిశ్రమలు వెంటనే తెరిపించాలని నినాదాలు చేశారు. రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ పీఎస్‌కు తరలించారు.
ఇదీ చూడండి: