ETV Bharat / state

ప్రపంచ శాంతికి కెనడాలో సుదర్శనయాగం - కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్తసోసైటీ ( శ్రీ సాయిబాబా మందిరం)

ప్రపంచ శాంతి కోసం సుదర్శన యాగం చేశారు కెనడాకు చెందిన కాల్గరీ శ్రీ అనఘా దత్త సోసైటీ ప్రతినిధులు. ఏప్రిల్ 26 వరకు పూజలు, యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

sudarshana yagam for world peace
ప్రపంచ శాంతి కోసం సుదర్శనయాగం
author img

By

Published : Mar 30, 2020, 6:50 PM IST

కెనడాలోని కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ (శ్రీ సాయిబాబా మందిరం) నిర్వాహకులు.. ప్రపంచ శాంతి కోసం సుదర్శన యాగం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. మార్చి 24న నుంచి ఏప్రిల్ 26 వరకు పలు యాగాలు, పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ నిర్మాతలు శ్రీమతి లలిత , శ్రీ శైలేష్, ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీ రాజకుమార్ శర్మ ఆధ్వర్యంలో మహా క్రతువును నిర్వహిస్తున్నారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో.. ఇప్పటివరకు జ్యోతి ప్రజల్వన, గురువందనం, చతుర్వేద పారాయణం, కరోనా విముక్తి కొరకు యోగ వశిష్ట మంత్రం ఉచ్ఛరణ, మహా సుదర్శన యాగం, శ్రీ సీతారామ కల్యాణం నిర్వహించారు. ఏప్రిల్ 26న వసంతపంచమి నాడు జరిగే యాగ క్రతువులతో ఈ కార్యక్రమం పరిసమాప్తం కానుందని చెప్పారు.

ప్రపంచ శాంతి కోసం సుదర్శనయాగం

ఇవీ చూడండి: కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.