హైదరాబాద్ రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట బైఠాయించారు.
కళాశాలలో కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు తరగతులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారికి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి'