ETV Bharat / state

'యూపీలో ముస్లిం కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు' - police attack on muslims

సీఏఏ చట్టాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకువచ్చారని వివధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఆరోపించారు. యూపీలో ముస్లిం కుటుంబాలను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

students spoke on caa protests in up
'యూపీలో ముస్లిం కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు'
author img

By

Published : Jan 28, 2020, 10:28 PM IST

యూపీలో పోలీసులు ముస్లింలను వారి కుటుంబాలను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులు హైదరాబాద్‌లో ఆరోపించారు. పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 15నగరాల్లో జరిగిన వాస్తవ పరిస్థితులను ఒక వీడియో రూపంలో చూపించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యూపీలో సీఏఏ,ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో ఘటనలపై మాట్లాడారు.

సమావేశంలో జేఎన్‌యూ, జామియా, హెచ్‌సీయూ యూనివర్సిటీల విద్యార్థులు ప్రసంగించారు. దేశంలోని 60ప్రధాన యూనివర్సిటీల విద్యార్థులు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనలపై ఒక ఫ్యాక్ట్‌ ఫైండింగ్ రిపోర్టు రూపొందించడం జరిగిందని వారు వివరించారు. సీఏఏ చట్టం కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకువచ్చారని తెలిపారు. యూపీలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి మతానికి సంబంధించిన వారి వివరాలు తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం, భాజపా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు హిందువులకు ఒక్కరే శత్రువని అది ముస్లింలనే విషాన్ని ఎక్కిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేసి.. జైళ్లలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ డిమాండ్ చేశారు.

'యూపీలో ముస్లిం కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు'

ఇవీ చూడండి: నిరుద్యోగంపై గళం విప్పండి: విద్యార్థులతో రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.