ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి, యువజన ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇంటికొక ఉద్యోగం అని చెప్పి... కనీసం ఊరికొక ఉద్యోగం ఇవ్వలేదని ఐకాస జాతీయ ఛైర్మన్ సగరపు ప్రసాద్ విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ... మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి ప్రకారం ప్రతి ఒక్క నిరుద్యోగికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని... కొవిడ్- 19 ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కూతురుని గెలిపించేందుకు ఉవ్విళ్లూరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే... రానున్న దుబ్బాక ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.