ETV Bharat / state

TS Schools Reopen: చదవాల్సింది తొమ్మిది.. చేరుతుంది ఎనిమిదిలో ఎందుకంటే?

ఎనిమిదో తరగతి(private schools non-issuance of TC) వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు.. 9, 10 తరగతుల్లో సర్కారు పాఠశాలకు మారాలంటే టీసీ(transfer certificate) తప్పనిసరి. కొవిడ్​ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చాలా మంది తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రైవేటు పాఠశాలలు (private schools) గతేడాది రుసుము చెల్లిస్తేనే టీసీ ఇస్తామని చెబుతున్నాయి(private schools non-issuance). చేసేదిలేక చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ 8వ తరగతిలోనే చేరాల్సి వస్తోంది.

school
school
author img

By

Published : Sep 23, 2021, 7:07 AM IST

రీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల వ్యాన్‌ డ్రైవరు తన కుమారుడిని గత ఏడాది వరకు ప్రైవేట్‌ బడిలో చదివించారు. ఈ ఏడాది 9వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో(GOVERNMENT SCHOOLS) చేర్పించేందుకు రాగా...టీసీ(transfer certificate) కావాలని చెప్పారు. అది ఇవ్వాలంటే రూ.25వేల ఫీజు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం పట్టుబట్టింది. చివరకు ఎంఈవోను కలిసి విన్నవించడంతో రూ.15వేలకు అంగీకారం కుదిరింది. ఫీజు వివాదం వల్ల బడులు తెరిచి 20 రోజులు దాటినా ఆ విద్యార్థి ఇంటిలోనే ఉన్నాడు.

విద్యా హక్కు చట్టం(RTE) ప్రకారం 8వ తరగతి వరకు టీసీ లేకున్నా ఆధార్‌ సంఖ్య ఉంటే విద్యార్థి వయసును బట్టి ఆయా తరగతుల్లో చేర్చుకోవచ్చు. 9, 10 తరగతుల్లో వేరే పాఠశాలల్లో చేరాలంటే టీసీ తప్పనిసరి. గత ఏడాది వరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిన నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యాలు స్పష్టంచేస్తున్నాయి. తమ పిల్లలు ఒకటిరెండు నెలలే ఆన్‌లైన్‌ పాఠాలు విన్నారని, ప్రత్యక్ష తరగతులు జరిగినప్పుడూ పంపలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ క్రమంలో రుసుములపై వివాదాలు తలెత్తుతున్నాయి. కొందరు కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నారని మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పారు. ఫీజును తగ్గించాలని రాజకీయ నాయకులతో చెప్పిస్తున్నారు. రుసుములు చెల్లించలేక కొందరు తమ పిల్లల్ని పాత తరగతుల్లోనే చేర్పిస్తున్నారు. మరికొందరు ఏడాది వృథా అవుతుందని భావించి ఎంతో కొంత చెల్లించి టీసీలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే కింది తరగతిలో చేర్పించవచ్చన్నారు. చేరాక ఛైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేసుకోవాలన్నారు.

ఉపాధి దెబ్బతిని.. సర్కారు బడివైపు

కరోనాతో ఉపాధి దెబ్బతిన్న అధిక శాతం కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. అందుకే ఈసారి ప్రైవేట్‌ పాఠశాలల్లో(PRIVATE SCHOOLS) మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది పిల్లలు ఇలా సర్కారు బడుల్లో చేరారని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది కంటే ఒక్క మేడ్చల్‌ జిల్లాలోనే 13వేల మంది పెరిగారు. భారీగా విద్యార్థులు వస్తుండటంతో గదులు సరిపోవడం లేదు. అందుకే ‘నో అడ్మిషన్‌’ బోర్డులు పెట్టాల్సివస్తోందని ప్రధానోపాధ్యాయుడు ఒకరు తెలిపారు.

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో గత ఏడాది ఎనిమిదో తరగతి చదివిన విద్యార్థి ఈ సంవత్సరం లక్డీకాపూల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ ఎనిమిదో తరగతిలోనే చేరాడు. కారణం.. తొమ్మిదో తరగతిలో చేరాలంటే టీసీ తప్పనిసరి కావటం. అది కావాలంటే ప్రైవేట్‌ యాజమాన్యం గత ఏడాది ఫీజు చెల్లించాలని పట్టుబడుతోంది. తన కుమారుడు ఒకటి రెండు నెలలే ఆన్‌లైన్‌ పాఠాలు విన్నాడనేది ఆ విద్యార్థి తల్లి వాదన. తొమ్మిదిలో చేరేందుకు టీసీ కావాలని ఉపాధ్యాయులు చెప్పడంతో ఆమె కొడుకుని 8వ తరగతిలోనే చేర్పించారు.

ఇదీ చూడండి: ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కోడింగ్.. రోబోటిక్స్​పై ప్రయోగాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.