President residence visiting: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ఉచితంగా అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆదేశాలు జూన్ నెలాఖరు వరకు వర్తిస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని జూనియర్ కళాశాల విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని కోరారు. 162 సంవత్సరాల వారసత్వ కట్టడమైన రాష్ట్రపతి నిలయాన్ని ఉగాది రోజు నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు సాధారణ ప్రజలకు సందర్శనార్థం తెరిచారని అన్నారు.
రాష్ట్రపతి నిలయంలో ఏ ఏ ప్రదేశాలను చూడవచ్చు: రాష్ట్రపతి దక్షిణ భారత దేశ పర్యటన సమయంలో మినహాయించి ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ ప్రజలు సందర్శించవచ్చు అని గుర్తు చేశారు. గతంలో ప్రజలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరిమిత కాలం పాటు నిలయాన్ని సందర్శించేందుకు అనుమతించే వారు.. ప్రస్తుతం ఈ ఏడాది ఉగాది నుంచి ప్రెసిడెన్షియనల్ వింగ్, భోజనశాలతో సహా.. భవనం లోపలికి కూడా అనుమతిస్తున్నారు. డైనింగ్ హాల్‌కు వెళ్లే భూగర్భ సొరంగం ద్వారా ప్రయాణించి తెలంగాణ సాంప్రదాయ చేర్యాల్ పెయింటింగ్స్ చూడవచ్చు.
ప్రవేశానికి ఎవరికి ఎంత ధర: వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన నాలెడ్జ్ గ్యాలరీని కూడా సందర్శించి.. రాష్ట్రపతి పాత్ర, బాధ్యతలను గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న సందర్శకులు ఎవరైనా http://visit.rashtrapatibhavan.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోనే సదుపాయం కల్పించారు. సోమవారం, ప్రభుత్వ సెలవులు మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలయాన్ని సందర్శించవచ్చు. భారతీయులకు రూ.50లు, విదేశీయులకు రూ.250లు టికెట్ ధరగా నిర్ధారించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా లోనికి అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించిన టికెట్లులను ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించారు.
రాష్ట్రపతి నిలయం చరిత్ర: దేశంలోనే అత్యున్నతమైన నివాసంగా పేరుపొందిన వాటిలో రాష్ట్రపతి భవనం ఒకటి. ఇది దిల్లీలోని ఉంటుంది. దేశ పరిపాలన మొత్తం ఉత్తర భారతదేశానికే పరిమితం కాకుండా ఉండాలనే ఉద్దేశంత.. దక్షిణాదిలో బొల్లారం దగ్గర ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిలయాన్ని ఆంగ్లేయులు 1805లో బొల్లారంలో కట్టించారు. ఈ భవనాన్ని అప్పట్లో వైశ్రాయ్ అతిథి గృహంగా పిలిచేవారు. దీన్ని నిజాం పరిపాలనలో వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిలయాన్ని కేంద్ర ప్రభుత్వం 1950 సంవత్సరంలో రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తరవాత దీనికి రాష్ట్రపతి నిలయంగా పేరు పెట్టారు.
ఇవీ చదవండి: