ETV Bharat / state

JNTU Hyderabad Updates: హెచ్​వోడీపై చర్యలు తీసుకోవాలంటూ జేఎన్టీయూలో ధర్నా - కూకట్‌పల్లి జేఎన్టీయూలో ధర్నా

క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి కోరిన విద్యార్థినిని అవమానించేలా మాట్లాడిన హెచ్​వోడీపై చర్యలు తీసుకోవాలంటూ జేఎన్టీయూలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్​లోని కూకట్​పల్లి(JNTU Hyderabad Updates)లోని ప్రిన్సిపల్ ఛాంబర్​లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

JNTU ANDOLANA
ప్రిన్సిపల్ కారును అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
author img

By

Published : Sep 30, 2021, 9:36 PM IST

హైదరాబాద్​లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ(JNTU Hyderabad Updates)లో విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి కోరిన విద్యార్థినిని అవమానించేలా మాట్లాడిన హెచ్​వోడీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ ఛాంబర్​లో బైఠాయించి హెచ్​వోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

JNTU ANDOLANA
ప్రిన్సిపల్​ ఛాంబర్​లో బైఠాయించిన విద్యార్థి నాయకులు

జేఎన్టీయూలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీజ అనే విద్యార్థిని జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతినివ్వాలంటూ హెచ్​వోడీ శ్రీనివాసులును కోరింది. విద్యార్థులకు ఆటలెందుకంటూ.. చదువుపై దృష్టి పెట్టాలని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన హెచ్​వోడీ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

జేఎన్టీయూలో విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన

శ్రీజ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని.. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: JNTU exams postponed: జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.