Inter Student Suicide in Hyderabad : హైదరాబాద్ కుల్సుంపురా భరత్‌నగర్ బస్తీలో ఉండే ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న నవ్య అనే విద్యార్థిని మృతి స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా జోగిపేట పోరంపల్లికి చెందిన శ్రీనివాస్, రమ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కుల్సుంపురా భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమ.. మదీనాలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. వీరికి సంజన, నవ్య, దివ్య అనే ముగ్గురు ఆడపిల్లలున్నారు.
Kulsumpura Inter Student Suicide News : ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న నవ్య.. గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఏడున్నరకు తన గదిలో ఉరి వేసుకుని కనిపించిందని తెలిపారు. నవ్య చావుకు క్షుద్రపూజలే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తమ ఇంటి ముందు పూజలు చేసినట్లు ఆనవాళ్లున్నాయని.. గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళ్తున్నారని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నవ్య భయంగా ఉంటుందని.. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు.
- కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు.. వారి కోసమేనా?
- క్షుద్రపూజల పేరుతో కన్నకూతురిని చంపిన తల్లి!.. వంటగదిలోనే పూడ్చిపెట్టి..
"పోయిన అమావాస్య రోజు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటి ముందర ఏవేవో వేయడం స్టార్ట్ చేశారు. కొబ్బరి కాయలు, నిమ్మ కాయలు, నలుపు రంగు బొమ్మ, నువ్వులు, ఇంకా ఏదో పౌడర్ చల్లారు. అవి మా ఇంటి ముందర వేసినప్పటి నుంచి ఇంట్లో ఉన్న కుక్కలు మొరగడం మానేశాయి. మా చెల్లి మొదటి నుంచీ చాలా యాక్టివ్‌గా ఉండేది. మా ఇంటి ముందర అవన్నీ చూసినప్పటి నుంచి బాగా డల్ అయిపోయింది. నిన్న ఉదయం కూడా పసుపు, కుంకుమలు రాసిన నిమ్మకాయలు ఇంటి ముందర పెట్టారు. అవి చూసి నవ్య ఇంకా ఎక్కువ డల్ అయిపోయింది. సాయంత్రం కాగానే ఇళ్ల మీద ఉన్న బట్టలు, ఇంకా ఏవైనా ఎగిరినట్లు కనిపిస్తే భయపడేది. నిన్న రోజంతా బాగానే ఉంది. సాయంత్రం కాస్త డల్‌గా కనిపిస్తే ఏమైందని అడిగాను. ఏం లేదని చెప్పింది. నేను వంట చేస్తూ పైన ఉన్నాను. 5 నిమిషాల్లో వస్తానని చెప్పి చెల్లి కిందకు వచ్చి ఉరివేసుకుని చనిపోయింది." - నవ్య సోదరి
బాలిక మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నట్లుగా ఏమైనా జరిగాయా.. లేదంటే ఇంట్లో ఏమైనా గొడవల కారణంగా నవ్య చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవీ చూడండి..
ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని..
Fraud Swamiji in Kammadanam: కాళీమాత పేరిట పూజలు.. నమ్మాక లక్షల్లో మోసాలు
శవాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్లో ఉడకబెట్టి.. మిక్సీ పట్టి.. లివిన్ పార్ట్నర్ దారుణ హత్య!