ETV Bharat / state

విద్యార్థిని బలితీసుకున్న బెట్టింగ్​ భూతం - ravi kumar

మొదట అదొక సరదా.. తర్వాత వ్యసనం.. చివరికి ప్రాణాలు బలి... ఇది క్రికెట్​ బెట్టింగ్​లో పాల్గొనేవారి దుస్థితి.  ఇలా ఓ విద్యార్థి క్రికెట్​ బెట్టింగ్​లో డబ్బులు కోల్పోయాడు. రాజశేఖర్​ అనే వ్యక్తి వద్ద అప్పు చేశాడు. అటు రాజశేఖర్​ ఒత్తిడి ఇటు ఇంట్లో చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని బోరబండ​లో జరిగింది. రాజశేఖర్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రవి ఫొటోతో తల్లిదండ్రులు
author img

By

Published : Aug 8, 2019, 9:41 PM IST

Updated : Aug 8, 2019, 9:47 PM IST

విద్యార్థిని బలితీసుకున్న బెట్టింగ్​ భూతం

"డాడీ మీ డబ్బులు వృథా చేశాను.. నేను క్రికెట్ బెట్టింగ్ కావాలని ఆడలేదు.. నన్ను క్షమించండి.. రాజశేఖర్​ టార్చర్​ తట్టకోలేకపోతున్న... నేను అందరిని వదిలి పోతున్న.. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. శ్రావణి అక్క అల్లుడు జాగ్రత్త.. ఐ లవ్​ యూ నాన్న.. ఐ లవ్​ యూ అక్క." ఇది క్రికెట్ బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు విడిచిన ఓ విద్యార్థి సూసైడ్ నోట్​ సందేశం​.

హైదరాబాద్​ బోరబండలోని హఫీజ్ ఫాతిమానగర్​లో విష్ణుమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి డిగ్రీ చదివే కుమారుడు రవి కుమార్ ఉన్నాడు. స్థానికంగా పెయింటర్​గా పనిచేస్తున్న రాజశేఖర్ అనే యవకుడితో రవికి పరిచయం ఏర్పడింది. ఐపీఎల్​తో పాటు పలు క్రికెట్ మ్యాచ్​ల సమయంలో అతడితో కలిసి రవి బెట్టింగ్​లో పాల్గొనేవాడు. అలా 80 వేల రూపాయలు దాకా రాజశేఖర్​కి అప్పుపడ్డాడు. వాటిని చెల్లించాలని తరచూ రవిని వేధించడం మొదలు పెట్టాడు.

యాక్సిడెంట్​ చేశానని అబద్ధం

ఏం చేయాలో తెలియక... తానో యాక్సిడెంట్ చేశానని అందుకు రూ.40 వేలు కట్టాలంటూ తండ్రికి చెప్పాడు. ఇది నమ్మిన తండ్రి తన సొంత ఊరిలోని ఇల్లు అమ్మి రవికి డబ్బు ఇచ్చాడు. మరో 40 వేలు ఇవ్వాలంటూ రవికి వేధింపులు మొదలయ్యాయి. విషయం తండ్రికి తెలియడం వల్ల డబ్బు తాను కడతానని..తన కొడుకుని ఇబ్బంది పెట్టొదని రాజశేఖర్​ను తండ్రి విష్ణుమూర్తి వేడుకున్నాడు.

వేధింపులు

రాజశేఖర్ వేధింపులు ఎక్కువ అవడం, తన తండ్రిని ఇబ్బంది పెడుతున్నానని తీవ్ర మనోవేదనకు గురైన రవి ఈనెల 3న ఇంట్లో ఎవరు లేని సమయంలో బలన్మరణానికి పాల్పడ్డాడు. రాజశేఖర్ బలవంతంగా తాను వద్దు అన్నా బెట్టింగ్​లోకి దింపి డబ్బులు కోసం వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్​లో రాసుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాజశేఖర్​ కోసం గాలింపు చేపట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిలా పడి ఉండటంతో కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు మరెవరూ క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడవద్దని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో

sample description
Last Updated : Aug 8, 2019, 9:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.