ETV Bharat / state

'ఉద్యోగాలు పోయినయ్... మా పిల్లల స్కూల్ ఫీజు తగ్గించండి '

ట్యూషన్ ఫీజులో 50 శాతం తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్​ బోయిన్​పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కరోనా విపత్కర సమయంలో తమకు ఉద్యోగాలు లేక ఈ ఫీజుల భారం చెల్లించలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

student-parents-protest-in-fort-of-st-aandrus-school-at-boinpally-in-hyderabad
ట్యూషన్​ ఫీజు తగ్గించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
author img

By

Published : Jul 21, 2020, 12:51 PM IST

హైదరాబాద్​ బోయిన్​పల్లి సెయింట్​ ఆండ్రూస్​ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లింద్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు నిర్వహించే ఆన్లైన్ క్లాసులకు 50శాతం ట్యూషన్ ఫీజు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తాము ఉద్యోగాలు కోల్పోయి ఫీజులు కట్టలేని దుస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల కిందట స్కూలు యాజమాన్యంతో ఈ విషయమై చర్చలు జరిపామని కానీ అవి విఫలం అయ్యాయని వారు తెలిపారు.

అందువల్లే ఆందోళనకు దిగామని.. ఉదయం నుంచి తాము నిరసన వ్యక్తం చేసినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణి వహిస్తుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం వల్ల పాఠశాలల వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో న్యాయపరంగా తాము ముందుకు వెళ్తామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.