కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని సికింద్రాబాద్ బొల్లారం పబ్లిక్ స్కూల్ల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్, విశ్రాంత జవాను జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవితో వాటు విద్యార్థులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు ఎంతో గొప్పవని వారిని ఆదర్శంగా తీసుకోవాలని కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్ సూచించారు. కార్గిల్ యుద్ధంలో అమరుడైన జవాన్ రామచంద్ర రావుకు నివాళి అర్పించారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడే ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవీ చూడండి: 'నేరెళ్ల తరహాలోనే కుడిముంజలో గౌడ కులస్థులపై దాడి'