ETV Bharat / state

‘అమ్మ ఒడి’ సరే.. అభివృద్ధి ఏదీ?: మంత్రి అంబటికి విద్యార్థిని ప్రశ్న

Girl Question to Minister Ambati: ఏపీలో అభివృద్ధి లేకపోవడంపై విద్యార్థులు కూడా నిలదీయడం ప్రారంభించారు. తాజాగా ఓ విద్యార్థిని మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి అమ్మఒడి వస్తుందా అని మంత్రి.. విద్యార్థినిని అడిగారు. దానికి సమాధానంగా.. ‘అమ్మఒడి సరే.. అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు’ అని డిగ్రీ విద్యార్థిని మంత్రిని ప్రశ్నించింది.

Ambati Rambabu
Ambati Rambabu
author img

By

Published : Jan 9, 2023, 2:24 PM IST

Girl Question to Minister Ambati: ‘అమ్మఒడి సరే.. అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు’ అని డిగ్రీ విద్యార్థిని మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించింది. ఊహించని ఈ ప్రశ్నలకు ఆమెను సమాధానపర్చలేక.. బాగా చదువుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 15వ వార్డులో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రితో విద్యార్థిని పిట్టల ప్రవళిక సంభాషణ చర్చనీయాంశమైంది.

మంత్రి: ప్రభుత్వం నుంచి ‘అమ్మ ఒడి’ అందుతోందిగా..

విద్యార్థిని: ‘జగనన్న విద్యా దీవెన’ అందుతోంది. ఈ సాయం సరే.. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏదీ? మూడు రాజధానులంటున్నారు. రాజధాని ఇక్కడే ఉంటే ఉద్యోగావకాశాలు వస్తాయి కదా.. అమరావతిలోనే రాజధానిని ఎందుకు నిర్మించరు?

మంత్రి: రాజధాని సంగతి తర్వాత.. బాగా చదువుకుంటే అమెరికాలో అయినా ఉద్యోగం చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగావకాశాలు ఉంటాయి.

విద్యార్థిని : వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలని నాకు లేదు. రాష్ట్రంలోనే ఉద్యోగం చేస్తా.

దీంతో విద్యార్థిని చొరవను స్థానికులు ప్రశంసించారు. మరోవైపు ఆమె కుటుంబీకులు.. ఏ పార్టీ అని వైసీపీ నాయకులు ఆరా తీశారు. వారు వైసీపీకి మద్దతుదారులే అని తేలింది.

ఇవీ చదవండి: తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు

రైల్వేశాఖలో 4వేల పోస్ట్​లకు నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.