రాష్ట్రంలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఇతర హిందుత్వ సంస్థల కార్యకర్తలపై అక్రమ కేసులు, బైండోవర్ పేరుపై వేధించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని భజరంగ్ దళ్, వీహెచ్ పీ నాయకులు డిమాండ్ చేశారు. యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా సాగుతున్నా... ఎందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేరుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెబుతున్నా... సరిహద్దులు దాటి అక్రమంగా గోవులు హైదరాబాద్ లోకి ప్రవేశిస్తున్నాయన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని... బక్రీద్ పేరుతో రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా గోహత్య నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. హిందూ సంస్థల కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... అడిషనల్ డీజీపీ డాక్టర్ జితేందర్ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.