తీరిక లేని జీవన శైలిలో కాస్త సమయం ధ్యానానికి కేటాయిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, మనసును ప్రశాంతంగా ఉంచుకోగలమని రామచంద్ర మిషన్ కో ఆర్డినేటర్ ఎన్వీ కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ నల్లకుంటలో మూడ్రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు.
హార్ట్ఫుల్నెస్ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో దీర్ఘమైన, లోతైన ధ్యానంలోకి దాదాపు సమాధి స్థితిలోకి వెళ్లవచ్చని కృష్ణారావు తెలిపారు. నిర్మూళీకరణ పద్ధతి ద్వారా ధ్యానం చేసే సమయంలో మనల్ని ఆటంకపరిచే అనేక ఆలోచమల నుంచి విముక్తి పొందవచ్చని వెల్లడించారు.
- ఇవీ చూడండి: 'అమరావతి' భవిత తేలేది నేడే..!