సికింద్రాబాద్ చిలకలగూడ బౌద్ధనగర్‌లో రేషన్ బియ్యం పంపిణీలో తోపులాట జరిగింది. సామాజిక దూరాన్ని పాటించే క్రమంలో ఓ వ్యక్తి క్యూ మధ్యలోకి రావడానికి ప్రయత్నించగా ఘర్షణ మొదలైంది. గొడవ పడుతున్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు కూడా జత కలిసి దాడికి దిగారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం