ETV Bharat / state

రాత్రిపూట భయపెడుతున్న వీధి కుక్కలు

ఇటీవల మౌలాలిలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి గాయపరచడం... అప్పుడే పుట్టిన పసికందును తీసుకెళ్లి పీక్కు తినడం లాంటి ఘటనలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తున్న వీధి కుక్కల వల్ల రాత్రి పూట అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్​ అధికారులు వీటిని నియంత్రించి శునకాల బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

భయపెడుతున్న శునకాలు
author img

By

Published : Jul 24, 2019, 1:49 PM IST

నగర ప్రజలను భయ పెడుతోన్న శునకాలు

శునకాలకున్న విశ్వాసం ఏ జంతువుకూ ఉండదంటారు. కానీ రోజురోజుకూ పెరిగిపోతున్న శునకాల దాడులతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బస్తీలు, కాలనీల్లో స్వేచ్చగా సంచరిస్తూ భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతున్న కుక్కల వల్ల రాత్రి పూట బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వీటిని నియంత్రించేలా మున్సిపల్​ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మెట్రో నగరాల్లో ఎక్కువే...

హైదరాబాద్​లాంటి మెట్రో నగరాల్లో కుక్కల సంచారం ఎక్కువగా ఉంటోంది. ఎక్కువగా కాలనీలు, బస్తీల్లోనూ చెత్తకుప్పల దగ్గర, పార్కులు, గ్రౌండ్ల పరిసరాల్లో సేదతీరే శునకాలు... రాత్రుళ్లయితే రోడ్ల మీదకొచ్చేస్తున్నాయి. వీటి వల్ల పాద చారులు, బైక్​పై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీలైతే ఆ వీధిని దాటి మరో వీధిగుండా ఇళ్లకు చేరుకుంటున్నారు.

పెరుగుతున్న కుక్క కాటు కేసులు

ఈ మధ్య తరచూ కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్​ వరకు హైదరాబాద్​ డివిజన్​లో 21 వేల రేబిస్​ కేసులు నమోదయ్యాయి. నగరంలోని కోరంటి ఫీవర్​ ఆసుపత్రిలో రోజు రోజుకూ కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 70 నుంచి 100 మందికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే కుక్కకాటు వేసిన 24 గంటలలోపు ఇమ్యునోగ్లోబిన్​ వ్యాక్సిన్​ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నగర వాసుల ఆందోళన

వీధి కుక్కల వల్ల రాత్రి పూట బయటకు వెళ్లలేక పోతున్నామని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాయోనని నిరంతరం భయానికి గురవుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్​ సిబ్బంది వీటిని నియంత్రించి... కుక్కకాటు నుంచి రక్షించాలని కోరుతున్నారు. గోవా, తమిళనాడులోని నీలగిరి జిల్లాల మాదిరి హైదరాబాద్​ను యాంటీ రేబిస్ నగరంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.