Street dogs attack the boy in nacharam: ఏ గల్లీలో చూసినా గుంపులు గుంపులుగా ఉంటాయి. సంచులు పట్టుకుని వస్తుంటే చాలు పరుగెత్తిస్తాయి. బైకులపై వచ్చే వాళ్లకూ భయం పుట్టిస్తాయి. ఇక చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే తెగబడిపోతాయి. రాత్రి వేళ్లల్లోనైతే... పట్టాపగ్గాలే ఉండవు. ఇందంతా ఏవో రౌడీ గ్యాంగ్‌ల గురించి కాదండోయ్... గల్లీల్లో దర్జాగా గర్జిస్తున్న వీధికుక్కల దౌర్జన్యం ఇది. ఇటీవల అంబర్‌పేట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడితో చనిపోయాడు.
తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ లో ఆడుకుంటున్న చిన్న బాలుడిపై వీధి కుక్కలు దాడికి ప్రయత్నించాయి.. చాకచక్యంగా వాటి నుంచి తృటిలో తప్పించుకున్న బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
హైదరాబాద్ నగరవాసులను గ్రామసింహాలు వణికిస్తున్నాయి. వీధుల్లో నడవాలంటే ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని జనం వణికిపోతున్నారు. గల్లీల్లో గుంపులుగా స్వైరవిహారం చేస్తూ... పాదాచారులుపైకి తెగబడుతున్నాయి. వాహనదారుల వెంట పరుగులు తీస్తూ... గుబులు రేపుతున్నాయి. పట్టపగలే కుక్కలు దాడులు చేయటం వల్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాత్రివేళల్లో అయితే చెప్పనక్కర్లేదు. వీధుల్లోకి ఒంటరిగా ఎవరు సంచరించినా ప్రాణ సంకటంగా మారుతున్నాయి.
పెరిగిన దాడులు...
గతంలో కార్పొరేషన్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుని చంపేసేవారు. బ్లూ క్రాస్, ఇతర జంతు సంరక్షణ సంఘాలు వంటి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల కుక్కలను వధించవద్దని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అప్పటి నుంచి శునకాలను పట్టుకోవడం మానేశారు.
చిన్నపిల్లలపై పడి రక్కేస్తున్నాయి...
హైదరాబాద్‌లో ఓ కాలనీలో సరదాగా ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క విచక్షణారహితంగా దాడి చేసి అందరిని బాధపెట్టింది. వివిధ ప్రాంతాల్లో శునకాల దాడుల తీవ్రత అధికంగా ఉండటం వల్ల స్థానికులు పిల్లల్ని భయటకు పంపించాలంటే భయపడుతున్నారు.
దూర ప్రాంతాల్లో వదిలేస్తే..
వాతావరణంలో మార్పుల వల్ల శునకాల లాంటి క్షీరదాల ప్రవర్తన భయానకంగా మారుతోందని జంతు వైద్యులు వివరిస్తున్నారు. ఆకలితో ఉన్నప్పుడు, పునరుత్పత్తి ప్రక్రియ సమయాల్లో చాలా హింసాత్మాకంగా ఉంటూ దాడులకు తెగబడతాయని హెచ్చరిస్తున్నారు. వీధి కుక్కలకు పునరుత్పతి నియంత్రించటమే కాకుండా వ్యాక్సిన్లు వేసి.. వాటిని సంరక్షణ కేెంద్రాలకు తరలిస్తే బాగుంటుందని నిపుణుల అభిప్రాయం
ఇవీ చదవండి: