హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది విద్యార్థులు 'స్ట్రీట్ కాజ్ వీజేఐటీ ఫీడ్ ది నీడ్' పేరిట ఓ బృందంగా ఏర్పడ్డారు. లాక్డౌన్తో ఉపాధి కరవై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొత్తపేటకు చెందిన 250 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేసి అండగా నిలిచారు.
సంస్థ నుంచి కొవిడ్ రిలీఫ్ ప్రాజెక్టులో భాగంగా రూ.లక్ష బడ్జెట్తో దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంస్థ డివిజన్ ప్రెసిడెంట్ హరీశ్ వివరించారు. యువత.. విద్యార్థి దశ నుంచే సమాజం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపడతామని విద్యార్థులు తెలిపారు.
ఇదీ చదవండి: మూడో దశలో 25% మంది పిల్లలకు కరోనా వైరస్?