ETV Bharat / state

రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల వెల్లువ.. పెరిగిన ఉపాధి - Huge investments in Telangana

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే.. ఔషధ, ఐటీ, వైమానిక, రక్షణ, సేవా రంగాల్లో కీలకంగా ఉంది. కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్‌ రంగానికీ గమ్యస్థానంగా మారుతోంది. సెల్‌ఫోన్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, కంప్యూటర్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ గృహోపకరణాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకూ వస్తువులను గతంలో దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తూ.. దేశవిదేశాలకు ఎగుమతులూ చేస్తున్నాం. ముఖ్యంగా అత్యంత డిమాండ్‌ ఉన్న సెల్‌ఫోన్ల తయారీ హబ్‌గా రాష్ట్రం ఎదుగుతోంది.

రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల వెల్లువ.. పెరిగిన ఉపాధి

author img

By

Published : Jan 6, 2021, 6:57 AM IST

ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు, జాతీయ, స్థానిక సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఈ రంగంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులను ప్రారంభించాయి. మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, ప్రయోగశాలలు, ఇంక్యుబేటర్లు ఏర్పాటవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో కోర్సులు చేసిన వారికి రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ విధానాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, భూములు- మౌలిక సదుపాయాలు, మానవవనరుల లభ్యత ఇవన్నీ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ రంగం అభివృద్ధికి ఇంజన్లుగా మారాయి.

వివరాలిలా...

తెలంగాణ ఆవిర్భావ సమయంలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు 250 వరకూ ఉన్నాయి. వాటిలో 50 వేల మంది ఉపాధి పొందేవారు. గత ఆరేళ్లలో పరిశ్రమలు రెట్టింపయ్యాయి. కొత్తగా రూ.23 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు తోడు 1.60 లక్షల మందికి ఉపాధి దక్కింది. వచ్చే నాలుగేళ్లలో రూ.73,380 కోట్ల పెట్టుబడులు, మూడు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా కృషి చేస్తోంది.

మేడ్‌ ఇన్‌ తెలంగాణ

ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రం
‘ఎలక్ట్రానిక్స్‌ తయారీ’ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఒకటి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనలో ఈ రంగంలో ప్రైవేటు తయారీదారులను రాష్ట్రానికి ఆకర్షించాలని సంకల్పించింది. 14 ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా ఈ విభాగాన్ని ఎంపిక చేసింది. తెలంగాణను ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఈఎస్‌డీఎం) కేంద్రంగా ప్రకటించింది. 2016లో దీనికి ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించింది.

  • దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో రాష్ట్రం వాటా 6%
  • 2019లో ఈ ఉత్పత్తుల జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 8%
  • 2015-19 మధ్య తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ వృద్ధి రేటు 8.3%

ఎలక్ట్రానిక్‌ (ఇ) సిటీ, సమూహం

  • రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద సెమీకండక్టర్ల తయారీ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఫ్యాబ్‌ సిటీ విజయవంతం కాకపోవడంతో.. ప్రభుత్వం దానిని ఎలక్ట్రానిక్‌ (ఇ) సిటీగా మార్చింది. దీనిలో 40 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో రేడియంట్‌, మైక్రోమాక్స్‌, సెల్‌కాన్‌, కార్బన్‌, ఫాక్స్‌కాన్‌, స్కైవిన్‌, వన్‌ప్లస్‌, డేటా విండ్‌ తదితర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఆపిల్‌ కార్యాలయం వచ్చింది. ఒప్పో పరిశోధన అభివృద్ధి కేంద్రంతో పాటు 5జీ ప్రయోగశాలను ప్రారంభించింది. టీఎస్‌ఐఐసీ ఇ-సిటీలో పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం భవనాలు, షెడ్లు నిర్మించింది. కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి స్థలాన్ని లీజుపై కేటాయిస్తోంది.
  • మహేశ్వరం వద్ద 340 ఎకరాల స్థలంలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల తయారీ సమూహం ఏర్పాటు చేశారు. ఇక్కడ 25 పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇంకా పలుచోట్ల ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
    ఉపాధికి దన్ను
    ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ చదివిన రాష్ట్ర యువతకు స్థానిక ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన సంస్థ (టాస్క్‌)లో ఎలక్ట్రానిక్స్‌ కోర్సుల్లో శిక్షణ పొందిన వారి వివరాలను ప్రభుత్వం అందజేస్తుండగా.. సంస్థలు వారికి ప్రాధాన్యమిస్తున్నాయి. సేవారంగంలోనూ స్థానికులకే సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.

రాష్ట్రంలో ఏర్పాటైన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు

మేడ్‌ ఇన్‌ తెలంగాణ
  • ఆపిల్‌, ఇంటెల్‌, ఒప్పో, వన్‌ప్లస్‌, ఎన్విడియా, మొటొరోలా, మైక్రోమాక్స్‌, డేటా విండ్‌ క్వాల్కమ్‌, ఏఎండీ సీడీఏసీ, సైప్రస్‌, లిఅయాన్‌, స్కైవర్త్‌, ఎక్సికామ్‌..
  • ప్రభుత్వ రంగంలో ఇప్పటికే ఈసీఐఎల్‌, భెల్‌, బెల్‌, హెచ్‌ఏఎల్‌, సి-డీఏసీ తదితర పేరెన్నికగన్న ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు ఉన్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాల విధానం
రాష్ట్రంలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఎలక్ట్రిక్‌ వాహనాల విధానం’ ఆవిష్కరించింది. దీనికింద కొత్తగా మూడు పార్కులను ప్రకటించింది. పెద్దఎత్తున ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంది. కొత్త విధానం ఆవిష్కరణ రోజే నాలుగు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా, మరో రెండు కంపెనీలు ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’ అందించాయి. మైత్ర ఎనర్జీ రూ.2 వేల కోట్లు, ఒలెక్ట్రా రూ.300 కోట్లు, ఈటీఓ మోటార్స్‌ రూ.150 కోట్లు, గాయం మోటార్స్‌ రూ.250 కోట్లు, ప్యూర్‌ ఎనర్జీ రూ.500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా మొత్తం 14,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

మేడ్‌ ఇన్‌ తెలంగాణ

అభివృద్ధి పరిశోధన కేంద్రాలు

సంస్థ: మైక్రాన్‌

  • ఆర్‌అండ్‌డీ కేంద్రం: 3.50 లక్షల చదరపు అడుగుల స్థలం
  • ఉద్యోగులు: ప్రస్తుతం 700 మంది
  • రెండేళ్లలో 2 వేల మందికి ఉపాధి

సంస్థ: ఇంటెల్‌

  • ఆర్‌అండ్‌డీ కేంద్రం: 3 లక్షల చదరపు అడుగుల స్థలం
  • ప్రయోగశాలలు: 40 వేల చదరపు అడుగుల్లో

సంస్థ: వన్‌ప్లస్‌

  • చైనా బయట అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం
  • పెట్టుబడి: రూ.వెయ్యి కోట్లు
  • ఉపాధి: ప్రస్తుతం 200 మందికి
  • వచ్చే రెండేళ్లలో మరో 1500 మందికి

తెలంగాణలో కొత్త పరిశ్రమలు.. ఉపాధి అవకాశాలు

సంస్థ: ఛార్జ్‌ ఎక్స్‌వో

  • పెట్టుబడి: రూ.15 వేల కోట్లు
  • ఉత్పత్తి: లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ
  • ఉపాధి: 7,500 మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా

సంస్థ: స్కైవర్త్‌ గ్రూప్‌

  • పెట్టుబడి: రూ.700 కోట్లు
  • ఉత్పత్తి: ఎలక్ట్రానిక్స్‌ తయారీ
  • ఉపాధి: 5 వేల మందికి

సంస్థ: హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌

  • పెట్టుబడి: రూ.250 కోట్లు
  • తయారీ: ఆప్టికల్‌ ఫైబర్‌
  • ఉపాధి: 1500 మందికి

సంస్థ: ఎక్సికామ్‌ గ్రూప్‌

  • పెట్టుబడి: రూ.173 కోట్లు
  • తయారీ: లిథియం అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌
  • ఉపాధి: 3 వేల మందికి

సంస్థ: ఎన్నోలియా ఎనర్జీ

  • పెట్టుబడి: రూ.150 కోట్లు
  • పరిశ్రమ: లిథియం అయాన్‌ బ్యాటరీ అసెంబ్లీ
  • ఉపాధి: 300 మందికి
- జయేశ్‌రంజన్‌, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల ముఖ్య కార్యదర్శి

మనది అత్యుత్తమ విధానం
రాష్ట్ర ప్రభుత్వం 2016లో విడుదల చేసిన ఎలక్ట్రానిక్స్‌ విధానం అత్యుత్తమమైంది. భూముల లభ్యతకు తోడు కొత్తగా అన్నింటికీ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. రావిర్యాల, మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సమూహాలలో 80 శాతం భూముల కేటాయింపు పూర్తయింది. అన్ని రకాల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యేక పార్కులను, మెదక్‌ జిల్లా శివనగర్‌లో 130 ఎకరాల్లో ఎల్‌ఈడీ ఉత్పత్తుల పార్కును ఏర్పాటు చేస్తున్నాం. - జయేశ్‌రంజన్‌, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల ముఖ్య కార్యదర్శి

- పి.శ్రావణ్‌కుమార్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో నిపుణులు, తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా

తెలంగాణకు గర్వకారణం
నేను లండన్‌లో ఎమ్మెస్‌ చేసి, విదేశాల్లోనే కొన్నాళ్లు ఉద్యోగం చేశాను. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల స్థాపన విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకున్నా. ఉద్యోగం వచ్చింది. గతంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఉద్యోగాలంటే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు ఉండడం, ఇక్కడే పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. - పి.శ్రావణ్‌కుమార్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో నిపుణులు, తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.