ETV Bharat / state

తెలుసుకుందామా.. క్రిస్మస్​ ట్రీ సంగతులు!!

author img

By

Published : Dec 25, 2019, 9:43 AM IST

హ్యాపీ మెర్రీ క్రిస్మస్‌... క్రిస్మస్‌ అంటేనే బోలెడన్ని ఆనందాలు.. శాంతాక్లాజ్ తాతయ్య తెచ్చే బహుమానాలు.. నోరు తీపి చేసుకోడానికి మిఠాయిలు.. మనకిష్టమైన క్రిస్మస్​ చెట్టుకు అలంకరణలు... మీకెప్పుడైనా సందేహం వచ్చిందా? క్రిస్మస్‌ చెట్టు నిజంగా వుంటుందా? అని! తెలుసుకోవాలంటే చదివేయండి మరి!

STORY ABOUT CRISTAMAS TREE
తెలుసుకుందామా.. క్రిస్మస్​ ట్రీ సంగతులు!!

దయాగుణం, సత్యం పరస్పరం కలిసే ఉంటాయి. అలాగే ధర్మం, శాంతి ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి-ఏసుక్రీస్తు

మనం బుజ్జి బుజ్జి గంటలూ, చిన్న చిన్న నక్షత్రాలు, రంగురంగుల లైట్లతో అలంకరించే క్రిస్మస్‌ చెట్లు నిజంగానే ఉన్నాయి. అదీ ఒక్కటి రెండు కాదు ఎన్నో రకాలున్నాయి.

ఆహ్లాద ‘పైన్‌’

  • ఇవి సుమారు 3 నుంచి 80 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.
  • వీటిలోనూ కొన్ని రకాలుంటాయి.
  • వీటికి సన్నని పొడవైన ఆకులుండి చివర్లో చిన్న చిన్న గోధుమ రంగులో ఉన్న పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఆనందాల ‘సైప్రస్‌’

STORY ABOUT CRISTAMAS TREE
ఆనందాల ‘సైప్రస్‌’
  1. ఇవి దాదాపు 35 నుంచి 70 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
  2. వీటిలో అరిజోనా సైప్రస్‌, లేలాండ్‌ సైప్రస్‌ అనే రకాలను క్రిస్మస్‌ ట్రీగా వినియోగిస్తారు.
  3. ఇందులో లేలాండ్‌ సైప్రస్‌ చెట్టునుంచి ఎటువంటి వాసనా రాదు. సువాసన వద్దనుకునేవారు దీన్ని క్రిస్మస్‌ చెట్టుగా అలంకరించుకుంటారు.
  4. అరిజోనా సైప్రస్‌ ఆకులు చివర్లో చిన్న పసుపు రంగు బల్బులు అమర్చినట్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వీటి కాయలు గుండ్రంగా బూడిద రంగులో ఉంటాయి.

‘ఫిర్‌’తో జోష్‌

STORY ABOUT CRISTAMAS TREE
‘ఫిర్‌’తో జోష్‌
  • ఇవి దాదాపు 10 నుంచి 80 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.
  • ఎక్కువగా ఉత్తర, మధ్య అమెరికా, యూరప్‌, ఆసియా, ఉత్తర ఆఫ్రికాలోని పర్వతాల్లో కనిపిస్తాయి.
  • ఇందులోనూ మళ్లీ కొన్ని రకాలున్నాయి. వీటిని బట్టి వాటి ఆకుల రంగులు, వాసనల్లో చిన్న చిన్న తేడాలుంటాయి.
  • వీటికి చిన్న చిన్న ముళ్లులాంటి ఆకులుండి చివర్లో గుండ్రటి గింజలుంటాయి.

సేడార్‌’ దారుల్లో..

STORY ABOUT CRISTAMAS TREE
సేడార్‌’ దారుల్లో..
  1. వీటిని మన దగ్గర దేవదారు చెట్లంటారు. ఇందులో రెడ్‌ సేడార్‌ను క్రిస్మస్‌ ట్రీగా ఉపయోగిస్తారు.
  2. తూర్పు ఎర్ర దేవదారు, పెన్సిల్‌ దేవదారు, సుగంధ దేవదారు అనీ పిలుస్తారు.
  3. ఇవి దాదాపు 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.
  4. ఆకుపచ్చని సన్నని ఆకులుంటాయి. వీటికి తెల్లని చిన్న గుండ్రటి కాయలుంటాయి.

‘స్ప్రూస్‌’తో ఏర్పాట్లు పూర్తి!

STORY ABOUT CRISTAMAS TREE
‘స్ప్రూస్‌’తో ఏర్పాట్లు పూర్తి!
  • ఇవి దాదాపు 20 నుంచి 60 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
  • ఉత్తర అమెరికా సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
  • ఇందులో బ్లూ స్ప్రూస్‌, నార్వే స్ప్రూస్‌, వైట్‌ స్ప్రూస్‌ అనే రకాలున్నాయి.
  • ఎక్కువగా బ్లూ స్ప్రూస్‌ను అక్కడి వారు క్రిస్మస్‌ చెట్టుగా అలంకరిస్తారు.

ప్రస్తుతం మనం అలంకరిస్తున్న క్రిస్మస్‌ చెట్లను మొదటగా 16వ శతాబ్దంలో జర్మనీ వారు ఉపయోగించారు.

ఇదీ చూడండి: ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.