ETV Bharat / state

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. కొత్త విభాగం ఏర్పాటు దిశగా అడుగులు

Drugs Control: మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డ్రగ్స్​ నియంత్రణకు పటిష్ఠ వ్యూహం అమలు చేసే దిశగా సర్కారు కదులుతోంది. మాదకద్రవ్యాలు-వ్యవస్థీకృత నేరాల నిరోధక కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించడంతో దీనికి సంబంధించిన విధివిధానాలను అధికారులు ఖరారు చేస్తున్నారు.

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. కొత్త విభాగం ఏర్పాటు దిశగా అడుగులు
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. కొత్త విభాగం ఏర్పాటు దిశగా అడుగులు
author img

By

Published : Jan 29, 2022, 4:10 AM IST

Drugs Control: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ వ్యూహం అమలు చేసే దిశగా సర్కారు కదులుతోంది. మాదకద్రవ్యాలు-వ్యవస్థీకృత నేరాల నిరోధక కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించడంతో దీనికి సంబంధించిన విధివిధానాలను అధికారులు ఖరారు చేస్తున్నారు. ప్రత్యేక నిఘా వ్యవస్థ, విస్తృత దాడులతో ఎక్కడికక్కడ వినియోగం, రవాణాలను కట్టడి చేయడం, క్రమేణా మత్తు పదార్థాల వినిమయాన్ని సమూలంగా నిర్మూలించడం లక్ష్యాలుగా వ్యూహరచన సాగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే అనేక ప్రయోగాలు చేస్తున్న పోలీసులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్‌ పేరుతో ప్రత్యేక కమెండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది సఫలీకృతం కావడంతో ఇతర రాష్ట్రాలతో పాటు, కేంద్ర బలగాలు కూడా మన గ్రేహౌండ్స్‌ వద్ద శిక్షణ తీసుకునేవి. తీవ్రవాద సమాచార సేకరణకు ఏర్పాటు చేసుకున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్సైబీ) కూడా సత్ఫలితాలనిచ్చింది. ఉగ్రవాద నిరోధానికి ఏర్పాటు చేసిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ) సెల్‌ అనేక కుట్రలను భగ్నం చేసింది. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచీ ఉన్న వ్యూహనైపుణ్యాలను రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ సర్కారు కొనసాగిస్తోంది. డ్రగ్స్‌ నియంత్రణకు ఏర్పాటు చేయబోయే కొత్త విభాగం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

ఇలా కార్యాచరణ

ప్రాథమిక అంచనాల ప్రకారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే కొత్త విభాగం బాధ్యతలు ప్రస్తుత సీఐసెల్‌ ఐజీ రాజేష్‌కుమార్‌కు అప్పగించే అవకాశం ఉంది. మూడొంతుల సిబ్బంది పోలీసుల నుంచి, ఒక వంతు ఆబ్కారీ నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. కేవలం మత్తుమందుల సమాచారం సేకరించేందుకే సొంతంగా అన్ని హంగులతో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు, పట్టుబడ్డ మత్తుమందులను అప్పటికప్పుడు విశ్లేషించేలా ప్రత్యేకంగా మొబైల్‌ కిట్లు అందజేయడంతోపాటు ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.