ETV Bharat / state

డిమాండ్లు పరిష్కరించాలంటూ.. ఉద్యోగుల ఆందోళనలు - కనీస వేతనాన్ని రూ.21వేలకు పెంచాలని వీఆర్‌ఏల డిమాండ్​

AP Employees Protest: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ.. ఆంధ్రప్రదేశ్​ విద్యుత్‌ ఉద్యోగులు, పీఆర్​ఏలు ఆందోళన బాట పట్టారు. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా నాలుగేళ్లకోసారి వేతన సవరణ అమలుకు డిమాండ్‌ చేశారు. కనీస వేతనాన్ని 21వేలకు పెంచాలని, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వీఆర్​ఏలు దీక్షలు, ధర్నాలు చేపట్టారు.

Employees Protest
ఉద్యోగుల ఆందోళనలు
author img

By

Published : Feb 9, 2022, 10:07 AM IST

AP Employees Protest: ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ఏలూరు జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని... మూడు డీఏల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లకోసారి వేతన సవరణ చేపట్టాలని నినదించారు.

ధర్మ పోరాట రిలే దీక్షలు..

అనంతపురం జిల్లా మడకశిరలో విద్యుత్ ఉద్యోగులు.. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని కోరారు. కడపలో విద్యుత్‌ భవన్‌ ఎదుట కాంట్రాక్ట్‌ కార్మికులు ధర్నా చేశారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మడకశిర తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్​ఏలు నిరసన దీక్షకు దిగారు. ఆ తర్వాత తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. వీఆర్‌ఏల కనీస వేతనాన్ని 21వేలకు పెంచాలని... తమకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని నినాదాలు చేశారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వీఆర్‌ఏలు "ధర్మ పోరాట రిలే దీక్షలు" నిర్వహించారు. అర్హులైన వారికి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద వీఆర్​ఏలు రిలే దీక్షలు చేపట్టారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్​ఏలుగా నియమించాలని కోరారు. పీఆర్సీలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు అన్యాయం జరిగిందంటూ విశాఖలో నిరసన తెలిపారు. అన్యాయాన్ని సరిచేయకుంటే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు.

ప్రకాశం జిల్లా అద్దంకిలో వీఆర్​ఏలు ధర్నా నిర్వహించారు. మార్చి 10లోగా డిమాండ్లు పరిష్కారం కాకపోతే చలో అమరావతి చేపడతామని స్పష్టంచేశారు.గుంటూరు జిల్లా మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో రెవెన్యూ సిబ్బంది ఆందోళనలు చేపట్టారు.

ఉద్యోగుల ఆందోళనలు

ఇదీ చదవండి: Land Grabbing in Sangareddy : 310 ఎకరాల భూమి కబ్జా.. దందా వెనుక ఆ ముగ్గురి పాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.