ఆటోమొబైల్ దుకాణాల్లో భౌతిక దూరం తప్పకుండా పాటించాలని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు స్పష్టం చేశారు. షోరూమ్‌లు, విడిభాగాలు అమ్మే దుకాణాల వద్ద అందరూ శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో పాటు జీహెచ్‌ఎంసీ, జిల్లాల్లోని మున్సిపల్ అధికార యంత్రాంగం, ఇతర జిల్లా యంత్రాంగం సూచించిన నిబంధనల్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటులోకి వచ్చిన ఆటోమొబైల్ దుకాణాలకు వెళ్లే వినియోగదారులతో పాటు షోరూం యాజమాన్యాలు, సిబ్బంది సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని రావు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాలన్నీ పని చేస్తుండంటం వల్ల కరోనా వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలతో సేవలు అందించడం జరుగుతోందన్నారు. కరోనా నివారణ, నియంత్రణకై ఆర్టీఏ కార్యాలయాలు, చెక్ పోస్టులు, యూనిట్ ఆఫీసుల్లోనూ ప్రభుత్వ నిబంధనల్ని తప్పక పాటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు