ETV Bharat / state

'యాదాద్రి కేంద్రంగా సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలి'

హైదరాబాద్​ సుందరయ్య కళా నిలయంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

author img

By

Published : Jan 5, 2021, 7:48 PM IST

Updated : Jan 5, 2021, 8:00 PM IST

State Nai Brahmin Sangh New Year Calendar unveiled at Sundarayya Kala Nilayam, Hyderabad
'వేదాద్రి కేంద్రంగా సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలి'

రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బాగ్​లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్​ ఆవిష్కరణలో పాల్గొని.. బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంఘ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్​ ఆవిష్కరించారు.

ప్రణాళికలు సిద్ధం

సీఎం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు హెయిర్ కటింగ్ షాపులకు ఉచిత కరెంటు వంటి హామీలు నెరవేర్చడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. వెనకబడిన కులాల వారి సంక్షేమం కోసం ప్రతి కులం నుంచి పది మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

'నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్​కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి సంవత్సరానికి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అందరికీ తక్షణమే రుణాలు మంజూరు చేయాలి. యాదాద్రి కేంద్రంగా సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో నాయీ బ్రాహ్మణ భవనాలను ఏర్పాటు చేయడానికి స్థలముతో పాటు నిధులు కేటాయించాలి'

-దేవరకొండ నాగరాజు ,రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి: ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

Last Updated : Jan 5, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.