రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెగా పవర్ లూమ్ క్లస్టర్(mega power loom cluster to siricilla)ను మంజూరు చేయాలని చేనేత, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(minister ktr).. కేంద్రాన్ని మరోమారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర జౌళి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్(union minister piyush goyal)కు లేఖ రాశారు. సీపీడీఎస్ కింద ఎలాంటి జాప్యం లేకుండా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని లేఖలో కేటీఆర్ కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి 7 సార్లు లేఖలు రాసినా స్పందన లేదని గుర్తు చేశారు.
వనరులు పుష్కలం
చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎలాంటి మద్దతు ఉండటం లేదని కేటీఆర్(minister ktr) అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్‌కు కావాల్సిన నిపుణులైన కార్మికులు, వనరులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నాయని లేఖలో వివరించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా రాయితీలతో పాటు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తుందని చెప్పారు.
'మెగాపవర్ లూమ్‌లో పనిచేసేందుకు యువత ఎదురుచూస్తోంది. బడ్జెట్లో చేనేత రంగానికి అదనపు నిధులు కేటాయించాం. ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవట్లేదు. కేంద్రం ప్రకటిస్తున్న పథకాలను కొన్నేళ్ల నుంచి గమనిస్తున్నాం. ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కేంద్రం విస్మరిస్తోంది.' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
యువతకు అవకాశాలు
ఇతర దేశాలతో పోటీపడి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు సాధిస్తోందని, భారత్ చిన్నదేశాలతో కూడా పోటీపడలేకపోతోందని కేటీఆర్(minister ktr) ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటిస్తున్న పథకాలన్నీ ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు మల్లుతున్నాయని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. ఇకనైనా జాప్యం చేయకుండా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని కోరారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్లో పనిచేసేందుకు తెలంగాణ యువత ఎదురుచూస్తోందని కేంద్ర మంత్రి(union minister piyush goyal)కి లేఖలో స్పష్టం చేశారు.
క్లస్టర్ ఏర్పాటుకు నిధుల కోసం విజ్ఞప్తి
కేంద్ర మంత్రిమండలి.. జౌళి రంగంలో(Texttiles industry) కొత్తగా ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు కేంద్ర సాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr), మంత్రి కేటీఆర్(minister ktr)లు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర చేనేత, జౌళి శాఖల మంత్రులను కలిసి రూ.2 వేల కోట్లు అందించాలని అభ్యర్థించారు. వాటిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఎలాంటి జాప్యం లేకుండా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్(mega power loom cluster to siricilla) ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
ఆ జాబితాలో తెలంగాణ కూడా
జౌళి రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ఐదేళ్లలో రూ.10,683 కోట్లు వెచ్చించేలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటీవ్(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించింది. దాంతో లబ్ధి పొందనున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. అయితే కేంద్రం ఇప్పటివరకు నిధులు మాత్రం కేటాయించలేదు.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి సోనూసూద్ సోదరి- ఎమ్మెల్యేగా పోటీ