విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి క్రీడలు దోహదపడతాయని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనస్థలిపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపంలో అటల్ బిహారి వాజ్పేయీ మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 300 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రారంభమైన ఈ టోర్నమెంట్ రేపు సాయంత్రానికి ముగియనుంది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అటల్ బిహారి వాజ్పేయీ మెమోరియల్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష