ETV Bharat / state

Telangana: రూ.1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక - ఆర్థికమంత్రి హరీశ్ రావు

రాష్ట్రంలో లక్షా 86వేల కోట్లతో 2021-22 ఏడాదికి రుణప్రణాళిక ఖరారైంది. 29వ బ్యాంకర్ల సమితి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వ్యవసాయానికి రూ.91,541 కోట్లు బ్యాంకర్లు రుణాలుగా అందించనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.39,361 కోట్లు, విద్య, గృహనిర్మాణం, వసతులు, పునరుత్పాదక ఇంధనానికి రూ.13,451 కోట్లుగా ఖరారు చేశారు.

state-level-bankers-meeting-at-brk-bhavan
ఆర్థికమంత్రి హరీశ్ రావు
author img

By

Published : Jun 28, 2021, 4:42 PM IST

Updated : Jun 29, 2021, 5:21 AM IST

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) 2021-22 సంవత్సరానికి రూ.1,86,035 కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించింది. సోమవారం బీఆర్కే భవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ రుణ ప్రణాళికను విడుదల చేశారు. గత ఏడాది పంట రుణాలను ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లకు కలిపి రూ.41,200 కోట్లు అందజేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు దీర్ఘకాలిక రుణాలను రూ.16,816 కోట్లు, విద్య రుణాలు రూ.693 కోట్లు, గృహ రుణాలు రూ.4162 కోట్లు అందజేసినట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లక్ష్యం కంటే తొమ్మిదిశాతం ఎక్కువగా రూ.38416 కోట్లు, ముద్ర రుణాలు రూ6445 కోట్లు అందించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కింద రూ.7080 కోట్లను మంజూరు చేయగా రూ.5969 కోట్లు అందజేశామన్నారు. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి కింద 3,10,145 మందికి రుణాలు అందజేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు.

రైతుబంధు నిధులు రూ.281 కోట్లు రుణాలకు సర్దుబాటు

వానాకాలం రైతుబంధుకు సంబంధించి బ్యాంకులకు విడుదల చేసిన మొత్తంలో రూ.281 కోట్లను రైతులకు సంబంధించిన రుణాలకు సర్దుబాటు చేయడమో, ఆపడమో చేసినట్లు బాంకర్లు తెలిపారు. వడ్డీలేని రుణాలు, పావలావడ్డీ రుణాలకు సంబంధించి 2014వ సంవత్సరం నుంచి అన్ని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.725 కోట్లను విడుదల చేయాల్సి ఉందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

సకాలంలో రుణాలిస్తే రైతులకు మేలు: హరీశ్‌

రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్ల సమావేశంలో కోరారు. తద్వారా ఎరువులు, విత్తనాలకు రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. వారం రోజుల్లోనే వానాకాలం రైతుబంధుకు సంబంధించి 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.7360 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందజేసిన మొత్తాన్ని రైతుల ఇతర రుణ బకాయిలకు సర్దుబాటు చేయకుండా వారి పొదుపు ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. బ్యాంకర్లు దీన్ని కచ్చితంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ఎక్కువ మంది చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలను అందించాలని కోరారు. కొవిడ్‌ సమయంలోనూ బ్యాంకులు చక్కటి సేవలు అందించాయన్నారు. ఎంపీ బి.బి.పాటిల్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎస్‌బీఐ సీజీఎం, ఎస్‌ఎల్‌బీసీ ఛైర్మన్‌ ఓపీ మిశ్రా, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌, ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ నిఖిల, నాబార్డ్‌ సీజీఎం కృష్ణారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం

Last Updated : Jun 29, 2021, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.