అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రుణ విస్తరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 29వ తేదీ వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ రుణ విస్తరణ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించింది.
వివిధ పథకాలపై అవగాహన
వివిధ పథకాలపై ఈ నెల 29వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్బీసీ) స్పష్టం చేసింది. వీటిలో ప్రధానంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, పీఎంఈజీపీ, పీఎం స్వనిధి, వ్యవసాయ మౌలిక వసతులు నిధి, గృహ, విద్యారుణాలు, డిజిటల్ లావాదేవీలు తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఔట్ రీచ్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఎస్‌ఎల్బీసీ కన్వీనర్ కిషన్ శర్మ తెలిపారు.
ఇదీ చూడండి: