ETV Bharat / state

'తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారు' - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో దోపిడీ కొనసాగుతోందని రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి ఆరోపించారు. తరుగు పేరుతో మిల్లర్లు ఇబ్బంది పెడితే మిల్లర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు.

'తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారు

author img

By

Published : May 16, 2021, 7:12 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైస్​ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి అన్నారు. తరుగు పేరుతో మిల్లర్లు ఇబ్బంది పెడితే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు.

మంత్రికి చిత్తశుద్ధి ఉంటే తూకం వేయగానే రైతులకు ట్రాక్ సిట్ ఇచ్చేట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో కేతకి రైస్ మిల్లు వాళ్లు ఒక బస్తకి 3 కిలోలు కడ్తా తీస్తుంటే అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో 40కిలోలకు 42కిలోలు తూకం వేసి మళ్లీ రైస్ మిల్లర్లు క్వింటాకు 3 నుంచి 5 కిలోల కడ్తా తీస్తున్నారని ఆరోపించారు.

నల్గొండ, సూర్యాపేట, వరంగల్ రూరల్, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్ ఇలా అన్ని జిల్లాలో ఇదే దోపిడీ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిల్లర్ల లైసెన్స్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో లారీలను సమకూర్చడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాలు పడి ధాన్యం.. తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.