ETV Bharat / state

State govt To Corporations: రుణాలకు కొత్త షరతులపై అభ్యంతరం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేఖలు

State govt To Corporations: నీటిపారుదల ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలకు సంబంధించి ఏకపక్షంగా కొత్త షరతులు తగవని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టం చేసింది. ముందు చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా రిజర్వ్‌ బ్యాంకుతో కలిపి త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలనడం రాజకీయ ప్రేరేపిత చర్యగా కనిపిస్తోందని ఆర్​ఈ,సీ, పీఎఫ్​సీలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. కొత్త షరతులతో నిధులు నిలిపివేస్తే ప్రాజెక్టుల పనులు నిలిచిపోతాయని, న్యాయపరమైన చర్యలకు కూడా వెళ్లాల్సి వస్తుందని లేఖ రాసినట్లు తెలిసింది.

State govt To Corporations:
State govt To Corporations:
author img

By

Published : May 14, 2022, 5:01 AM IST

Updated : May 14, 2022, 5:34 AM IST

State govt To Corporations: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దేవాదుల, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది దీంతో పాటు వివిధ సంస్థల నుంచి రుణాలు కూడా తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్​ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్- పీఎఫ్​సీ కూడా ప్రాజెక్టులకు రుణాలు ఇస్తున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్, జలవనరుల సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌లకు రెండు సంస్థలు రుణాలను గతంలోనే మంజూరు చేశాయి. అందుకు అనుగుణంగా ఆయా కార్పొరేషన్ల మధ్య అవగాహనా ఒప్పందాలు కూడా జరిగాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్​ఈసీ, రూ.30,536 కోట్ల రుణం మంజూరు చేసి ఇప్పటి వరకు రూ.12,742 కోట్లు విడుదల చేసింది. పీఎఫ్​సీ రూ.37,737 కోట్లు మంజూరు చేసి రూ.33,079 కోట్లు విడుదల చేసింది. జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఆర్​ఈసీ- రూ.13,516 కోట్లు మంజూరు చేసి రూ.12,239 కోట్లు విడుదల చేసింది. పీఎఫ్​సీ రూ.3,426 కోట్లు మంజూరు చేసి రూ.410 కోట్లు విడుదల చేసింది.

తాజా పరిణామాల్లో రాష్ట్రాల రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రుణాల విషయంలో గ్యారెంటీ కోసం రిజర్వ్ బ్యాంకును కలుపుకొని త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని అందులో పేర్కొన్నాయి. ఈ పరిమాణం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్​తో అధికారులు ఈ విషయమై చర్చించారు. ఇటీవల జరిగిన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ల సమావేశంలోనూ ప్రాజెక్టుల కార్పొరేషన్లకు రుణాలు, సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. ఇప్పుడు ఇటువంటి షరతులు పెట్టడం వల్ల ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో ఆర్​ఈసీ, పీఎఫ్​సీలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. రుణాల విషయంలో కొత్త షరతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ పంపినట్లు సమాచారం. చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా రుణాల ద్వారా వచ్చిన నిధులతో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో పంటలసాగు గణనీయంగా పెరగడంతో పాటు తలసరి ఆదాయం కూడా వృద్ధి అయినట్లు వివరించినట్లు తెలిసింది. పంటల ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా జీఎస్​డీపీలో వ్యవసాయరంగం వాటా 21 శాతం పెరిగిందని, భవిష్యత్ లో ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం.

రుణాలకు కొత్త షరతులపై అభ్యంతరం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేఖలు

రుణాలకు సంబంధించిన చెల్లింపుల విషయంలోనూ ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022 - 23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనే ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన అంశాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో త్రైపాక్షిక ఒప్పందం పేరిట అకస్మాత్తుగా కొత్త షరతు తీసుకురావడం సమంజసం కాదని, రాజకీయ ప్రేరేపిత చర్యగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు లేఖలో అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఆయా సంస్థలకు ఇది మంచిది కాదని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుత దశలో రుణాలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోతే ప్రాజెక్టుల పనులు నిలిచిపోతాయని... పనులు ఆలస్యమై, ధరలు పెరిగిన ఆర్థికంగా భారమవుతాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ కార్పొరేషన్లు ఎన్పీఏలుగా మారితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నట్లు తెలిసింది. రుణాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒప్పందంలోనే తగిన నిబంధనలు ఉన్నాయని... త్రైపాక్షిక ఒప్పందం లాంటి కొత్త షరతులు, నిబంధనలు పెట్టవద్దని సూచించింది. ఏకపక్షంగా షరతులు, నిబంధనల పేరిట నిధులు నిలిపివేస్తే అది చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్న ప్రభుత్వం... అవసరమైతే తాము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్ఈసీ, పీఎఫ్ సీలకు లేఖలో వివరించినట్లు తెలిసింది.

ఇవీ చూడండి: ఫేస్​బుక్​ క్రైం కథలో కొత్త కోణం.. చంపొద్దని శ్వేతారెడ్డి మెస్సేజ్​.. కానీ..!!

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం

Last Updated : May 14, 2022, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.