కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని.. కొన్ని రాష్ట్రాలు సైతం ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సబబు కాదన్న అభిప్రాయం కేబినెట్‌లో వ్యక్తమైంది. దీంతో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని.. మంత్రివర్గం నిర్ణయించింది. పరీక్షల రద్దు నిర్ణయంతో పాటు ఫలితాల విధానాన్ని ప్రభుత్వం సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది.