ETV Bharat / state

వైద్యవిద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు - new medical colleges

రాష్ట్రంలో ఏడు చోట్ల కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వైద్యసీట్ల పెంపుతోపాటు, అనుబంధ ఆసుపత్రుల రూపంలో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. 2022-23లో ఎక్కడ కళాశాలలు ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు ఇస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కొత్తవి సాకారమైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మొత్తం 16 వైద్యకళాశాలలు వస్తాయి.

State Government measures towards strengthening medicine in the state
వైద్యవిద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు
author img

By

Published : Jun 19, 2021, 7:36 AM IST

Updated : Jun 19, 2021, 8:03 AM IST

రాష్ట్రంలో వైద్యవిద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైద్యసీట్ల పెంపుతోపాటు, అనుబంధ ఆసుపత్రుల రూపంలో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఏడు చోట్ల కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒక్కో కళాశాలలో 150 చొప్పున వచ్చే రెండు విద్యా సంవత్సరాల్లో కొత్తగా 1,050 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి కళాశాలకు అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి తప్పనిసరి. ప్రస్తుతానికి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి ఒక్కటే వైద్యకళాశాల ఏర్పాటుకు సన్నద్ధంగా ఉంది. వచ్చే (2022-23) సంవత్సరం ప్రారంభమయ్యేలా సంగారెడ్డి సహా మూడు కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగిలిన వాటికి మరుసటి సంవత్సరం దరఖాస్తు చేయనున్నారు. ఇప్పటికే తొమ్మిది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 1,640 సీట్లుండగా.. కొత్త సీట్లతో అవి 2,690కు పెరగనున్నాయి. కొత్తవి సాకారమైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మొత్తం 16 వైద్యకళాశాలలు వస్తాయి. ఏటా కొత్త వైద్యకళాశాలల కోసం జూన్‌, జులై మాసాల్లో జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

రాష్ట్రమంతటా వైద్యవిద్య విస్తరణ

తెలంగాణ ఏర్పాటుకు ముందు హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లో కాకతీయ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా 5 ప్రభుత్వ వైద్యకళాశాలలున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక, గత ఏడేళ్లలో మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్యకళాశాలలను నెలకొల్పారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లో ఈఎస్‌ఐ వైద్యకళాశాల, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రుల్లో కళాశాలలను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రమంతటికీ వైద్యవిద్యను విస్తరించినట్లవుతుంది. 2022-23లో ఎక్కడ కళాశాలలు ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు ఇస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

24 గంటలూ స్పెషాలిటీ వైద్యం

ప్రస్తుతం జిల్లా ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యం ఉన్నా, అది ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపే లభిస్తుంది. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే లభిస్తాయి. ఇందులో స్పెషాలిటీ వైద్యులు ఉండడం అరుదు. పడకల సంఖ్య కూడా 300 లోపే ఉంటుంది. వైద్యకళాశాల ఏర్పాటైతే అనుబంధ ఆసుపత్రి స్థాయి మారిపోతుంది. పడకల సంఖ్య పెరుగుతుంది. మరింత ఎక్కువమంది విద్యార్థులకు వైద్యవిద్య చేరువవుతుంది. అయిదేళ్లు గడిచేసరికి హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్యవిద్యార్థులు కూడా అందుబాటులోకి వస్తారు. దీంతో 24 గంటలూ స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల రోగులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు, పెద్ద పట్టణాలకు రావాల్సిన అవసరం ఉండదు. కొత వైద్యకళాశాలల కోసం ఇప్పటికే కొన్నిచోట్ల స్థల పరిశీలన పూర్తయినట్లు సమాచారం.

వైద్యంలో నాణ్యత పెరుగుతుంది
-డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల సంచాలకులు

కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుతో 22 విభాగాల్లో వైద్యసేవలు విస్తరిస్తాయి. ప్రతి విభాగంలోనూ ఒక ఆచార్యుడు, ఒక సహ ఆచార్యుడు, ఇద్దరు సహాయ ఆచార్యులుంటారు. అయిదేళ్లు గడిచాక స్పెషాలిటీ పీజీ సీట్లు, మున్ముందు సూపర్‌ స్పెషాలిటీ పీజీ వైద్య సీట్లు కూడా వస్తాయి. దీంతో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు స్థానికంగానే లభిస్తాయి. ఐసీయూలు అందుబాటులోకి వస్తాయి. వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల స్థాయి పెరుగుతుంది. పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు బలోపేతమవుతాయి. రేడియాలజీ విభాగం అందుబాటులోకి వస్తుంది. పోస్టుమార్టం చేయడానికి ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం కూడా ఉంటుంది. వైద్యవిద్యకు పరిశోధన తోడవుతుంది. అనుబంధంగా పారామెడికల్‌ కోర్సులు కూడా వస్తాయి. మొత్తంగా వైద్యంలో నాణ్యత పెరుగుతుంది.

ఇదీ చూడండి: దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత

Last Updated : Jun 19, 2021, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.