కరోనా నేపథ్యంలో భారీగా పడినపోయిన ప్రభుత్వ ఆదాయం... జూన్ నెలలో సాధారణస్థితికి చేరినట్లు సమాచారం. మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రావటంతో వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. ఈ తరుణంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోత విధించిన ప్రభుత్వం... ఆపై రిజర్వ్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి వచ్చింది.
మే 18వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోనూ సడలింపులు ఇవ్వగా... కొన్ని మినహా అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అదేస్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. జూన్ నెలకుగానూ ఆదాయ అంచనాలను చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు. జూన్‌లో సర్కార్ ఖజానాకు రూ. 11వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటుందని అంటున్నారు. ఆబ్కారీ ఆదాయం 30శాతం వరకు పెరగటమే కాకుండా... రిజిస్ట్రేషన్ల రాబడి బాగానే ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆదాయం పెరిగినందు వల్లే రైతుబంధుకు 6వేల కోట్లకుపైగా, ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వగలుగుతున్నట్లు పేర్కొన్నాయి.
ఇవీ చూడండి: కరోనా కట్టడిలో తెరాస తీరును ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు